Cognizant: ఉద్యోగులపై నిఘా పెట్టిన కాగ్నిజెంట్.. 5 నిమిషాల మౌస్ కదిలించకపోతే..
- ఉద్యోగులపై నిఘా పెట్టిన కాగ్నిజెంట్..
- ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా ఉద్యోగుల పని తీరును ట్రాక్..
- మౌస్‌ను 5 నిమిషాలలోపు కదిలించకపోతే ఉద్యోగి ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cognizant: ఐటీ రంగంలో ఉద్యోగులు ఏం చేస్తున్నారనేదానిపై ప్రతిరోజు నిఘా ఉంటుంది. ఒక ఉద్యోగి ఎంత సేపు వర్క్ చేస్తున్నాడు?, ఎంతసేపు ఖాళీగా ఉంటున్నాడు అనే దానిపై కంపెనీలు చూస్తుంటాయి. అయితే, ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కూడా ఇదే తరహాలో ఎంప్లాయిస్ కార్యకలాపాలపై నజర్ పెట్టింది. దీని కోసం కొత్త మానిటరింగ్ వ్యవస్థను తెచ్చింది. కంపెనీ జారీ చేసే ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా ఉద్యోగుల పని తీరును ట్రాక్ చేయనుంది. వారు ఉపయోగించే కీబోర్డు, మౌస్‌లను ట్రాకింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఈ స్థాయిలో ట్రాకింగ్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
అయితే, ఉద్యోగుల ల్యాప్‌ట్యాప్/ డెస్క్‌టాప్‌లో ఈ ట్రాకింగ్ కోసం ప్రోహ్యాన్స్ లాంటి టూల్స్‌ను కాగ్నిజెంట్ సంస్థ వాడుతుంది. ఎంప్లా్య్ ఖాళీగా ఉండే టైంని ఈ టూల్ ద్వారా ట్రాక్ చేస్తారు. మౌస్ లేదా కీబోర్డును ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇన్-యాక్టివ్‌గా ఉంచితే సదరు ఉద్యోగి ఖాళీగా ఉన్నట్లు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే, మౌస్ లేదా కీబోర్డు 15 నిమిషాల కంటే ఎక్కువసేపు కదిలించకపోతే వేరే పనిలో ఉన్నట్లు గుర్తిస్తుంది. ఈ మానిటిరింగ్ వ్యవస్థ ఒక్కో టీమ్‌కు ఒక్కోలా ఉంటుందని సమాచారం.
Read Also: Vijay Cinema House : కోర్ట్ మూవీ హీరోయిన్ కొత్త సినిమా స్టార్ట్
ఇక, ఈ ట్రాకింగ్‌ను ఎంప్లాయ్ పని తీరుతో ముడిపెట్టబోమని కంపెనీ వెల్లడించింది. ప్రమోషన్లు, బోనస్ లాంటి వాటి అంశాల్లో ఈ డేటాను ఉపయోగించమని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు చెప్పారు. అన్ని సంస్థల మాదిరిగానే ఈ టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. విప్రో లాంటి కంపెనీలు సైతం ప్రోహ్యాన్స్ టూల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. దీన్ని ఉపయోగించేందుకు ఉద్యోగి నుంచి పర్మిషన్ తీసుకుంటున్నామని కంపెనీ తెలియజేస్తున్నాయి. ఎంప్లాయిస్ మాత్రం తప్పనిసరి రూల్ అని చెబుతున్నారు. ఒక్కో టాస్క్‌పై ఎంత సేపు వర్క్ చేస్తున్నారు?.. ఏ అప్లికేషన్‌ను ఎంతసేపు ఉపయోగిస్తున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఏఐ రాకతో ఉద్యోగుల్లో ఇప్పటికే అభద్రతాభావం కొనసాగుతుండగా.. ఇలాంటి ట్రాకింగ్ టూల్స్ వల్ల ఉద్యోగుల పనిపై నిఘా పెట్టడమంటే వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టడమేనని వాపోతున్నారు.
తాజావార్తలు
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!