CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యులకు చెల్లు పెడుతూ నేడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వాటితో పాటే వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే సిలిండర్ గ్యాస్ (CNG) ధరలను కూడా పెంచేశారు. ఇరాన్ దేశంలో జరుగుతున్న గొడవల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ప్రముఖ గ్యాస్ కంపెనీలు ధరలను పెంచక తప్పలేదు. ముంబైలో ధరలు పెంచిన మరుసటి రోజే ఢిల్లీలో కూడా సీఎన్జీ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో గ్యాస్ పంపిణీ చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) కిలో సీఎన్జీపై రూ. 2 పెంచింది. దీనివల్ల అక్కడ కిలో గ్యాస్ ధర రూ. 77.09 నుండి రూ. 79.09 కి చేరింది. అంతకుముందు రోజే ముంబై మరియు దాని పరిసర ప్రాంతాలలో మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) కూడా కిలోపై రూ. 2 పెంచడంతో అక్కడ కొత్త ధర రూ. 84 కి చేరుకుంది. ఇలా గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఈ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పడిపోయాయి. మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ, ఐజీఎల్ మరియు ఎమ్జీఎల్ కంపెనీల షేర్లు దాదాపు 3 శాతానికి పైగా నష్టపోయాయి.
Also Read
- Bima Sakhi: 10th పాసైన మహిళలకు నెలకు రూ.7,000.. LIC బంపరాఫర్! పూర్తి వివరాలు ఇవే..
- Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
- Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
ఈ ధరల పెరుగుదల ప్రభావం సామాన్య ప్రయాణికులపై, రవాణా రంగంపై తీవ్రంగా పడనుంది. సీఎన్జీ రేట్లు పెరిగిన వెంటనే ముంబైలోని ఆటో రిక్షా సంఘాలు తమ ఆటో ఛార్జీలను కూడా పెంచాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఇంధన ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల డ్రైవర్ల సంపాదన తగ్గిపోతోందని, పాత ఛార్జీలతో ఆటోలు నడపడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!