NTV Telugu Site icon

Cinema Halls: ఈ నెల ఇంట్లోనే. సినిమా హాళ్లకు వెళ్లేది లేదు

Cinema Halls

Cinema Halls

Cinema Halls: ఈ నెల ఇంట్లోనే ఉంటామని, సినిమా హాళ్లకు లేదా మల్టీప్లెక్స్‌లకు వెళ్లే ఆలోచన లేదని మూవీ గోయెర్స్‌ నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. బాలీవుడ్‌లో రిలీజ్‌కి రెడీగా పెద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ ఈ సర్వేని దేశవ్యాప్తంగా 302 జిల్లాల్లో నిర్వహించింది. ఇందులో భాగంగా 11,707 మంది అభిప్రాయాలను సేకరించింది. దీన్నిబట్టి ప్రతి ఐదుగురిలో ఒకరికి (22 శాతం మందికి) వచ్చే రెండు నెలల పాటు అసలు సినిమాకి వెళ్లే ప్లానే లేదని తేలింది. మార్చిలో 41 శాతం మంది మాత్రమే ఈ ఒపీనియన్‌ని వెల్లడించగా ఈ పర్సంటేజ్‌ లేటెస్టుగా సగానికి పడిపోవటం గమనార్హం.

అదానీ భారీ పెట్టుబడి

గౌతమ్‌ అదానీ గ్రూపు ఒడిశాలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.416.53 బిలియన్లతో అల్యూమినియం రిఫైనరీని నిర్మించనున్నారు. క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకీ అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం నవీన్‌ పట్నాయక్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. రిఫైనరీ వార్షిక సామర్థ్యం 4 మిలియన్‌ టన్నులు అని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై స్పందించేందుకు ‘అదానీ’ ప్రతినిధి నిరాకరించటం గమనార్హం.

Online Games: ఆన్‌లైన్‌లో ఆడినంత ఆట. 5జీ ఎంట్రీతో ఆకాశమే హద్దు.

పెరిగిన యూజర్లు

డిస్నీ+హాట్‌స్టార్‌కి కొత్త యూజర్ల సంఖ్య పెరిగింది. ఏడాది కాలంలో 83 లక్షల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 5.84 కోట్లకు చేరింది. ఇది జులై 2 వరకు ఉన్న సమాచారం. ఇండియా, సౌత్‌ ఈస్ట్‌ ఆసియాకు సంబంధించిన డేటా. గతేడాది ఇదే సమయానికి పెయిడ్‌ యూజర్ల సంఖ్య 4.49 కోట్లుగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరం చివరికి సబ్‌స్క్రైబర్ల సంఖ్యను 8 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

స్టాక్‌ మార్కెట్లలో ఇవాళ ఫుల్‌ జోష్‌ కనిపిస్తోంది. దీంతో భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 567 పాయింట్లు పెరిగి 59384.62 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. నిఫ్టీ 137.80 పాయింట్లు పెరిగి 17672.55 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.45 వద్ద ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు రెండు నెలల్లో 26 శాతం లాభపడ్డాయి. టెక్‌ మహింద్ర, విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టైటాన్‌లకూ లాభాలు వచ్చాయి.