Bank Loans: సిబిల్ స్కోర్ 600 కంటే తక్కువ ఉన్నా బ్యాంక్ లోన్.. ఎలా పొందవచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Loans: సాధారణంగా బ్యాంక్ లోన్ పొందాలంటే చాలా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మనకు బ్యాంక్‌లో ఖాతా ఉండాలి.. దానిని సక్రమంగా కొనసాగిస్తుండాలి. మినిమమ్ బ్యాలెన్స్ కంటే తక్కువగా ఉంచకుండా అకౌంట్ కొనసాగిస్తుండాలి. ఇలా అన్నింటికి సక్రమంగా కొనసాగిస్తే మనకు సిబిల్ స్కోర్‌ను ఇస్తుంటారు. ఇలా మనం పొందే సిబిల్ స్కోర్‌ను బట్టి మనకు బ్యాంకులు మనకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అయితే సిబిల్ స్కోర్ తప్పకుండా 750 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అలా కాకుండా మనకు సిబిల్ స్కోర్ 500 లేదా 600 పాయింట్లు ఉంటే మనకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే ఆలోచిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో సిబిల్ స్కోర్ 500 నుంచి 600 ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరిస్తాయి. అవి ఎలాంటి సందర్భాలు.. ఎటువంటి పరిస్థితులు అంటే…
Read also: Hair fall: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Also Read
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
బ్యాంకుల నుంచి లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ 750 పాయింట్లు తగ్గకుండా ఉండటం తప్పనిసరి. సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ హిస్టరీని తెలియజేస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగానే మనకు రుణం మంజూరు చేయాలా? వద్దా? అని బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. మన సిబిల్ స్కోరు 750 కన్నా ఎక్కువగా ఉంటే లోన్ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతకన్నా తక్కువగా ఉంటే మాత్రం వడ్డీ రేటు పెరుగుతుంటుంది. సిబిల్ స్కోర్ 600 పాయింట్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే లోన్ లభించే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీటి ద్వారా లోన్ పొందడానికి అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ 500 లేదా 600 పాయింట్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే లోన్ పొందేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సిబిల్ స్కోర్ ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణాలను మంజూరు చేస్తుంటాయి. సాధారణంగా బ్యాంకులు ఎల్ఐసి పాలసీలను తనకా పెట్టుకుని రుణాలను మనకు అందిస్తాయి. అటువంటి సమయంలో మన ఎల్ఐసి పాలసీని బ్యాంకులో పెట్టి రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు వద్దకు వెళ్లి సమాచారం పొందాల్సి ఉంటుంది. పాలసీ విలువకు తగినట్లు మనకు రుణం ఇస్తారు. లోన్ పొందే బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నట్లయితే అందుకు తగినట్లుగా ఆ ఎఫ్‌డీల డిపాజిట్లపై రుణం పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండానే రుణం పొందే అవకాశం లభిస్తుంది. అలాగే మనం నివసించే గృహం మన సొంతం అయినట్లయితే ఆస్తి పత్రాలను సైతం బ్యాంకులో తనకా పెట్టి రుణం పొందవచ్చు. అలాంటి సందర్భంలో సైతం ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండానే బ్యాంకులు రుణం అందిస్తాయి. ఈ పద్ధతుల్లో మన సెక్యూర్డ్ రుణాలను పొందే అవకాశం ఉంది. మీరు సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోతే మాత్రం బ్యాంకు మీరు తనఖా పెట్టిన ఆస్తిని సొంతం చేసుకొని వేలంపాటలో విక్రయించే అవకాశం ఉంటుంది.
- Tags
- 600 Points
- bank
- CIBIL score
- FD
- loans
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!