NTV Telugu Site icon

Bank Loans: సిబిల్‌ స్కోర్‌ 600 కంటే తక్కువ ఉన్నా బ్యాంక్‌ లోన్‌.. ఎలా పొందవచ్చంటే?

Bank Loans

Bank Loans

Bank Loans: సాధారణంగా బ్యాంక్‌ లోన్‌ పొందాలంటే చాలా ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. మనకు బ్యాంక్‌లో ఖాతా ఉండాలి.. దానిని సక్రమంగా కొనసాగిస్తుండాలి. మినిమమ్‌ బ్యాలెన్స్ కంటే తక్కువగా ఉంచకుండా అకౌంట్‌ కొనసాగిస్తుండాలి. ఇలా అన్నింటికి సక్రమంగా కొనసాగిస్తే మనకు సిబిల్‌ స్కోర్‌ను ఇస్తుంటారు. ఇలా మనం పొందే సిబిల్ స్కోర్‌ను బట్టి మనకు బ్యాంకులు మనకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అయితే సిబిల్‌ స్కోర్‌ తప్పకుండా 750 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటేనే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అలా కాకుండా మనకు సిబిల్‌ స్కోర్‌ 500 లేదా 600 పాయింట్లు ఉంటే మనకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే ఆలోచిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో సిబిల్‌ స్కోర్‌ 500 నుంచి 600 ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరిస్తాయి. అవి ఎలాంటి సందర్భాలు.. ఎటువంటి పరిస్థితులు అంటే…

Read also: Hair fall: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

బ్యాంకుల నుంచి లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ 750 పాయింట్లు తగ్గకుండా ఉండటం తప్పనిసరి. సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ హిస్టరీని తెలియజేస్తుంది. సిబిల్ స్కోర్ ఆధారంగానే మనకు రుణం మంజూరు చేయాలా? వద్దా? అని బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. మన సిబిల్ స్కోరు 750 కన్నా ఎక్కువగా ఉంటే లోన్ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతకన్నా తక్కువగా ఉంటే మాత్రం వడ్డీ రేటు పెరుగుతుంటుంది. సిబిల్ స్కోర్ 600 పాయింట్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే లోన్ లభించే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీటి ద్వారా లోన్‌ పొందడానికి అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ 500 లేదా 600 పాయింట్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే లోన్ పొందేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సిబిల్ స్కోర్ ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా రుణాలను మంజూరు చేస్తుంటాయి. సాధారణంగా బ్యాంకులు ఎల్ఐసి పాలసీలను తనకా పెట్టుకుని రుణాలను మనకు అందిస్తాయి. అటువంటి సమయంలో మన ఎల్ఐసి పాలసీని బ్యాంకులో పెట్టి రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు వద్దకు వెళ్లి సమాచారం పొందాల్సి ఉంటుంది. పాలసీ విలువకు తగినట్లు మనకు రుణం ఇస్తారు. లోన్ పొందే బ్యాంకులో ఫిక్స్ డ్‌ డిపాజిట్లు ఉన్నట్లయితే అందుకు తగినట్లుగా ఆ ఎఫ్‌డీల డిపాజిట్లపై రుణం పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండానే రుణం పొందే అవకాశం లభిస్తుంది. అలాగే మనం నివసించే గృహం మన సొంతం అయినట్లయితే ఆస్తి పత్రాలను సైతం బ్యాంకులో తనకా పెట్టి రుణం పొందవచ్చు. అలాంటి సందర్భంలో సైతం ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండానే బ్యాంకులు రుణం అందిస్తాయి. ఈ పద్ధతుల్లో మన సెక్యూర్డ్ రుణాలను పొందే అవకాశం ఉంది. మీరు సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోతే మాత్రం బ్యాంకు మీరు తనఖా పెట్టిన ఆస్తిని సొంతం చేసుకొని వేలంపాటలో విక్రయించే అవకాశం ఉంటుంది.