NTV Telugu Site icon

Apple devices: యాపిల్‌ యూజర్లకు కేంద్రం హై సెక్యూరిటీ అలర్ట్‌

Applecompany

Applecompany

యాపిల్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ జారీ చేసింది. కంపెనీకి చెందిన ఐఫోన్స్‌, మ్యాక్స్‌, యాపిల్‌ వాచీలు ఉపయోగించేవారిని కేంద్రం అలర్ట్‌ చేసింది. యాపిల్ డివైజ్‌ల్లో పాత సాఫ్ట్‌వేర్‌లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఔట్‌డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఆయా డివైజులు వాడుతున్న వారికి అత్యధిక ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Guinness Record : ప్రపంచంలోనే అతిపెద్ద కోడి ఆకారంలో హోటల్… గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఓల్డ్ సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ లోపాల కారణంగా యాపిల్‌ డివైజుల్లో అక్రమంగా చొరబడి సెన్సిటివ్‌ డేటాను యాక్సెస్‌ చేయడం లేదా డేటా మానిప్యులేషన్‌కు పాల్పడే అవకాశం ఉందని సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. ఐఓస్‌ 18.1 కంటే ముందు వెర్షన్‌ లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్‌ఓఎస్‌ 18.1 కంటే ముందు లేదా 17.7.1 వెర్షన్‌ కలిగిన ఐప్యాడ్‌లు, పాత మ్యాక్‌ఓఎస్‌ వాడుతున్న మ్యాక్‌లు, వాచ్‌ ఓఎస్‌ 11 కంటే ముందు సాఫ్ట్‌వేర్‌ కలిగిన యాపిల్‌ వాచ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందని సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. దాడి చేసేవారు సున్నితమైన వినియోగదారు డేటాకు అనధికారిక యాక్సెస్‌ను పొందేందుకు, సేవకు అంతరాయం కలిగించడానికి లేదా డేటా మానిప్యులేషన్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. వీటితో పాటు పాత టీవీఓఎస్‌, విజన్‌ఓఎస్‌, సపారీ బ్రౌజర్లకు కూడా ఇదే తరహా ముప్పు పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ పాత సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు ఉపయోగిస్తున్న వారు తక్షణమే తమ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: ICC: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ ఎవరిని వరించిందో తెలుసా..?