వంటనూనె ధరల మంట నుంచి ఉపశమనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో వంట నూనెల ధరలు మంట పెట్టాయి.. సామాన్యుడు వంట నూనె కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కొన్ని బ్రాండ్‌ల నూనెల ధరలు ఓపెన్ మార్కెట్‌లో ఏకంగా 200కు చేరువయ్యాయి.. గత కొన్ని రోజులుగా క్రమంగా పైకి ఎగబాకుతూ పోయాయి.. అయితే, ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాలశాఖ ప్రకటించింది.. కొన్ని రకాల వంటనూనెల ధరలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయని పేర్కొంది.. పామ్ ఆయిల్ ధర 19 శాతం తగ్గి, కిలో రూ.115కు చేరగా.. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 16 శాతం తగ్గి కిలో రూ.157కు చేరిందని తన ప్రకటనలో పేర్కొంది పౌరసరఫరాల శాఖ. ఇక, గణాంకాల ప్రకారం, గత ఏడాదిగా వేరుసెనగ నూన్, ఆవ నూనె, వనస్పతి, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి 6 వంటనూనెల ధరలు 20 శాతం నుంచి ఏకంగా 56 శాతం వరకూ పెరుగుతూ పోయాయి..
ఆ గణాంకాల ప్రకారం ఆవనూనె ధర గత ఏడాది మే 28 నాటికి రూ.117 ఉండగా, ఈ ఏడాది మే 28కి రూ.171కి ఎగబాకింది.. సోయా అయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు 50 శాతానికి పెరిగాయి. 2021 మే నాటికి ఈ ఆరు వంటనూనెల ధరల పెరుగుదల 11 ఏళ్ల గరిష్టానికి చేరి ప్రజలకు గుదిబండలా మారాయి.. అయితే, అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీయ ధరలపై పడినట్టు చెబుతున్నారు అధికారులు.. వంటనూనెల పరంగా దేశ అవసరాల కోసం 56 శాతం దిగుమతులపై ఆధారపడడమే దానికి ప్రధాన కారణం అంటున్నారు.. తాజాగా.. దాదాపు 20 శాతం వంట నూనెల ధరలు తగ్గడం సామాన్యులకు కాస్త ఉపశమనంగా చెప్పాలి.
Also Read
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?