NTV Telugu Site icon

Vodka Flavours: వోడ్కా లవర్స్‌కి గుడ్ న్యూస్.. సరికొత్త ఫ్లేవర్‌తో డ్రింక్‌..

Vodka

Vodka

Vodka Flavours: లిక్కర్ లవర్స్ కి ఎంతో ఇష్టమైన బ్రాండ్ లలో వోడ్కా ఒకటి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని బాలయ్య బాబు బ్రాండ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. కాగా, మార్కెట్లో ఇప్పటికే వోడ్కాకు సంబంధించిన పలు ఫ్లేవర్స్ వచ్చాయి. అయితే, తాజాగా మరో సరికొత్త వేరియంట్ విడుదల అయింది. ప్రస్తుతం బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చిన ఈ డ్రింక్‌ త్వరలోనే వరల్డ్ వైడ్ గా తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొకా కోలా యూరోపాసిఫిక్ పార్టనర్స్‌ ‘అబ్సల్యూట్ వోడ్కా అండ్ స్పైట్ వాటర్ మెలాన్ పేరుతో టిన్స్ ను తీసుకొచ్చింది.

Read Also: Akkada Ammayi Ikkada Abbayi Review: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

అయితే, కొకా కోలా యూరోపాసిఫిక్ పార్టనర్స్‌ తాము తయారు చేస్తున్న రెడీ టు డ్రింక్ పానీయాల విభాగాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే, కొత్తగా అబ్సల్యూట్ వోడ్కా అండ్ స్పైట్ వాటర్ మెలన్ ఫ్లేవర్ ను రిలీజ్ చేసింది. ఇక, యునైటెడ్ కింగ్‌డమ్ వ్యాప్తంగా 250 మిల్లీలీటర్ల టిన్స్ లో ఈ ఫ్లేవర్ లభిస్తుంది. ఇందులో స్పైట్ కు ప్రత్యేకమైన రుచికి తోడుగా అబ్సల్యూట్ వోడ్కా స్మూత్ నెస్ సైతం ఉంటుందన్నమాట. అలాగే, వాటర్‌ మెలన్ వేరియంట్ ను వేరియంట్‌ను సైతం ఇందులో మిక్స్ చేశారు.

Read Also: TTD: గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ..

ఇక, ఈ కొత్త ఫ్లేవర్ కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. 84 శాతం మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించినట్లు ఓ సర్వేలో తేలింది. అయితే, ఈ టిన్‌ డిజైన్‌ను కూడా చాలా ప్రత్యేకంగా రెడీ చేశారు. రెడీ టు డ్రింక్ విభాగానికి అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్న ఎలైన్ మహార్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మేము ఆర్టీడీ విభాగంలో కొత్తదనం కోసం అడుగులు వేస్తున్నామన్నారు. వాటర్‌మెలాన్ ఫ్లేవర్ ను పరిచయం చేయడం ఒక గేమ్‌ ఛేంజర్ లాంటిదన్నారు. ఇది కేవలం అబ్సలూట్ వోడ్కా అండ్‌ స్ప్రైట్‌కే కాదు.. మొత్తం కేటగిరీకే సరికొత్త ఊపును ఇస్తుందన్నారు.

Read Also: Arjun s/oVyjayanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజ్ డేట్ లాక్.. రేపే ట్రైలర్

అలాగే, వోడ్కా నుంచి ఇప్పటికే వచ్చిన రడీ టూ డ్రింక్స్‌కి రోజు రోజుకి మరింత ప్రాధానత్య పెరిగిపోతుందని RTD విభాగం అసోసియేట్ డైరెక్టర్‌ ఎలైన్ మహార్ చెప్పుకొచ్చింది. లెమన్‌ లైమ్‌ మిక్సర్‌ స్పైట్‌కు ప్రజల నుంచి మంచి దొరుకుతుందన్నారు. ఇప్పుడు, వాటర్‌మెలాన్ లాంటి ఫ్రూటీ ఫ్లేవర్‌ చేర్చటంతో మేము ‘ఫ్లేవర్ ఇన్నొవేషన్’ అనే విభాగంలో మరో అడుగు వేశామన్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి సమ్మర్‌లో హ్యాపీగా గడపడానికి, ఫెస్టివల్స్‌ నుంచి చిల్‌ నైట్స్ వరకూ.. అబ్సలూట్ వోడ్కా అండ్‌ స్ప్రైట్‌ను సరి కొత్తగా ఆస్వాదించడానికి ఇది సరైన ఎంపిక అని ఎలైన్ మహార్ వెల్లడించింది.