ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATM Charges: దేశంలో ఏటీఎంల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో నగదు ఉపసంహరణకు సంబంధించిన ఛార్జీల్లో మార్పులు వచ్చాయి. ఆన్లైన్ లావాదేవీలకు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతుండగా, కెనరా బ్యాంక్ సెప్టెంబర్ 1 నుంచి ఏటీఎం లావాదేవీలపై కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చింది. కెనరా బ్యాంక్ పొదుపు ఖాతాదారులకు ఏటీఎంలో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు కలిపి నెలకు ఉచిత లావాదేవీల పరిమితిని ఐదుకు తగ్గించింది. అయితే సీనియర్ సిటిజన్లకు వర్తించే ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదు.
ఉచిత పరిమితి దాటిన తర్వాత కెనరా బ్యాంక్ ఏటీఎంలలో నగదు ఉపసంహరణతో పాటు యూపీఐ నగదు ఉపసంహరణకు విధించే ఛార్జీని రూ.20 నుంచి రూ.23కు పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసే లావాదేవీలకు కూడా ఛార్జీని రూ.17 నుంచి రూ.23కు పెంచినట్లు సమాచారం. ఆర్థికేతర లావాదేవీలకు మాత్రం ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.5తో పాటు జీఎస్టీ వసూలు చేసే విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో ఏటీఎం లావాదేవీ విఫలమైనా కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. మరోవైపు క్లాసిక్, స్టాండర్డ్, ప్లాటినం, బిజినెస్, సెలెక్ట్, వరల్డ్ కార్డులకు ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత గ్రీన్ పిన్ రీజెనరేషన్ ఫీజును కెనరా బ్యాంక్ రూ.23 నుంచి రూ.5కు తగ్గించింది. దీంతో ఏటీఎం వినియోగించే కస్టమర్లు కొత్త ఛార్జీలను గమనించాల్సిన అవసరం ఉంది.
Also Read
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!