Site icon NTV Telugu

BYJU’s: ఏం జరుగుతోందో.. ఏం చేయాలో.. మాకు తెలుసు: దివ్యా గోకుల్‌నాథ్‌

Byju’s

Byju’s

BYJU’s: ఎవరినీ కాపీ కొట్టకుండా మన స్టైల్లో కొత్త కంపెనీని ప్రారంభించి, విజయవంతంగా వృద్ధిలోకి తీసుకురావటం అంత ఈజీ కాదని బైజూస్‌ కో-ఫౌండర్‌ దివ్యా గోకుల్‌నాథ్‌ అన్నారు. ఎడ్‌టెక్‌ సంస్థలకు ఈమధ్య ఎదురవుతున్న సవాళ్ల గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. బైజూస్‌ ప్రారంభమైనప్పుడు అది కేవలం ఒక యాప్‌ మాత్రమేనని, ఇప్పుడు అనూహ్యంగా విస్తరించిందని చెప్పారు. ఈ క్రమంలో తమ వైపు నుంచి చోటుచేసుకున్న ఒకటీ అరా తప్పులను ఇప్పటికే గుర్తించామని, సరిచేసుకోవటానికి ప్రయత్నిస్తామని తెలిపారు.

‘ఈపీఎఫ్‌’పై కేంద్రం వివరణ

సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ వల్లే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ లావాదేవీలు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ సభ్యులకు ఆన్‌లైన్‌లో కనిపించట్లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 8 పాయింట్‌ 1 శాతం వడ్డీతో కూడిన క్రెడిట్‌లను రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ అకౌంట్లలో చూడలేకపోవటానికి ఇదే కారణమని స్పష్టం చేసింది. ఏడాదికి రెండున్నర లక్షలకు పైగా చేసే పీఎఫ్‌ పొదుపుపై ట్యాక్స్‌ను గతేడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సాఫ్ట్‌వేర్‌నే అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ఏ ఒక్క సభ్యుడికీ వడ్డీ నష్టం జరగదని, ప్రతిఒక్కరి అకౌంట్లలోనూ జమచేస్తామని ఆర్థిక శాఖ వివరించింది.

read also: Global Capability Centres: హైదరాబాద్‌ అవుతోంది ‘గ్లోబల్‌’. అదీ.. ఈ సిటీ ‘క్యాపబిలిటీ’ అంటే

కెన్యాకి పెరగనున్న టూరిస్టులు

ఈ ఏడాది 14 లక్షల మందికి పైగా ఫారన్‌ టూరిస్టులు వస్తారని కెన్యా అంచనా వేస్తోంది. గతేడాది 8 లక్షల 70 వేల మంది మాత్రమే వచ్చినట్లు తెలిపింది. దేశ పర్యాటక రంగ ఆదాయం 1.2 బిలియన్‌ డాలర్ల నుంచి 2.19 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని క్యాబినెట్‌ సెక్రెటరీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని నైరోబీలో ఏర్పాటుచేసిన మ్యాజికల్‌ కెన్యా టూరిజం ఎక్స్‌పోలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యా విదేశీ మారక నిల్వలకు టూరిజమే ప్రధాన వనరు. అందుకే కొవిడ్‌ ప్రభావం నుంచి కోలుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది.

Exit mobile version