కొత్తగా బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారు ముందుగా ఆలోచించేది పెట్టుబడి.. ఆ తర్వాత లాభాలను పరిగణలోకి తీసుకుంటారు.. పెట్టిన పెట్టుబడికి కనీసం రాకుంటే ఇక నష్టాలే మిగులుతాయి.. కాస్త తెలివిగా ఆలోచిస్తే మాత్రం ఎలాంటి బిజినెస్ లో నైనా అదిరిపోయే లాభాలను పొందోచ్చు.. జనాల అవసరాన్ని బట్టి ఆ బిజినెస్ చేస్తే మంచి లాభాలను పొందుతారు.. అలాంటి బిజినెస్ లలో ఒకటి బ్రెడ్ తయారీ.. ఈరోజుల్లో బ్రెడ్ ను ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటున్నారు.. రకరకాలుగా వాడుతున్నారు.. దాంతో మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. ఆ బిజినెస్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలనుకుంటే కనీసం రూ. 5 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర యోజన పథకం ద్వారా కూడా ఆర్థిక సాయాన్ని పొందొచ్చు. రూ. 5 లక్షల ప్రాథమిక పెట్టుబడితే బ్రెడ్ తయారీని ప్రారంభించొచ్చు. బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీని 500 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంది.. బ్రెడ్ ను తయారు చేసే మిషన్స్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు.. బ్రెడ్ తయారీకి పిండి, గ్లూటెన్, బ్రెడ్ ఇంప్రూవర్, కాల్షియం పౌడర్, డ్రై ఈస్ట్, ఉప్పు, చక్కెర, నూనె, ప్యాకింగ్ కోసం మెటీరియ్ అవసర పడుతుంది. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, జీఎస్‌టీ నెంబర్‌తో పాటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఇక సొంత బ్రాండ్‌తో విక్రయించాలనుకుంటే దీనికి ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది..
బ్రెడ్ బిజినెస్ లో వచ్చే లాభాలను చూస్తే.. సాధారణంగా బ్రెడ్ ప్యాకెట్ ధర రూ. 30 నుంచి రూ. 60 వరకు ఉంది. అయితే బ్రెడ్ తయారీకి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. మీరు తయారు చేసిన బ్రెడ్ ప్యాకేట్స్‌ను స్వంతంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రారంభ స్థాయిలోనే రూ. 50,000 వేల ఆదాయం పొందొచ్చు.. మార్కెట్ లో డిమాండ్ పెరిగే కొద్ది ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది.. మీకు దగ్గరలోని దుకాణాలు, సూపర్ మార్కెట్స్‌లో ఒప్పందం చేసుకుంటే ఆదాయం మరింత పెంచుకోవచ్చు.. ఆన్లైన్లో కూడా బిజినెస్ స్టార్ట్ చెయ్యొచ్చు.. డిమాండ్ పెరిగే కొద్ది ఆదాయం మరింత పెరుగుతుంది..