ఈరోజుల్లో ఖర్చులు అధికం.. వచ్చే ఆదాయం తక్కువ.. అయితే చాలా మంది వ్యాపారాలు చెయ్యాలని అనుకుంటారు.. కొన్ని బిజినెస్ లు బాగా సక్సెస్ అయితే మరికొన్ని బిజినెస్ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి.. అయితే ఇప్పుడు చెప్పే బిజినెస్ మాత్రం లాభాలను తెచ్చిపెడుతుంది.. ఒక్కసారి క్లిక్ అయితే మాత్రం లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు.. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆ బిజినెస్ ను ఎలా స్టార్ట్ చెయ్యాలి.. ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ ఐడియాని మీరు ఫాలో అవ్వడం వలన మంచిగా డబ్బులు వస్తాయి పైగా ఎటువంటి ఇబ్బందులు కలగవు. అదే కార్ వాషింగ్ బిజినెస్. కార్ వాషింగ్ ద్వారా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ని మీరు 22 వేల రూపాయలతో మొదలుపెట్టొచ్చు. 50 వేల వరకు సంపాదించుకోవచ్చు. రోడ్డు పక్కన ఏదైనా చిన్న షాప్ ని అద్దెకి తీసుకొని మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు.. లేదా మెకానిక్ ను కూడా పెట్టుకోవచ్చు.. ఒక్కసారి పేరు వస్తే.. సర్వీస్ కూడా జనాలకు నచ్చితే ఆటోమెటీక్ గా పాపులర్ అవుతారు..
కారు వాషింగ్ చేసే మెషిన్ ను కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది.. దాన్ని కొనాలంటే మీరు లక్ష రూపాయలు పెట్టాల్సి ఉంటుంది.. గ్లవుజులు, షాంపూ మొదలైనవి కావాల్సి ఉంటుంది. ఎక్కువ మంది వచ్చే చోట మీరు దీన్ని పెట్టుకుంటే బాగా క్లిక్ అవుతుంది. పెద్ద పెద్ద నగరాల్లో కూడా మీరు ఈ బిజినెస్ ని చేసుకోవడానికి బాగుంటుంది. ఒక ఏడు ఎనిమిది కార్లకి సర్వీసింగ్ చేస్తే రెండు వేల వరకు వస్తుంది.. ఇలా బిజినెస్ సాగే కొద్ది మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.. ఎలా లేదనుకున్నా మీకు 50 వేల వరకు ఆదాయం వస్తుంది..