Business Flash: టెస్లా అనూహ్య నిర్ణయం.. బిట్ కాయిన్‌లోని మేజర్ పెట్టుబడుల అమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash: బిట్ కాయిన్‌లో భారీ పెట్టుబడి పెట్టినట్లు విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 1.5 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్లు అప్పట్లో పేర్కొంది. అయితే అందులోని అధిక వాటాను ప్రస్తుతం అమ్మేసినట్లు వెల్లడించింది. క్రిప్టో కరెన్సీలోని 75 శాతాన్ని విక్రయించామని తాజాగా తెలిపింది. బిట్‌కాయిన్‌లోని ఇన్వెస్ట్‌మెంట్లను అమ్మటంతో టెస్లాకు 936 మిలియన్ డాలర్లు వచ్చాయి. వీటితో సంప్రదాయ కరెన్సీని కొనుగోలు చేసింది. క్రిప్టో కరెన్సీకి డిమాండ్ పెరగటంతో బిట్‌కాయిన్‌లోని టెస్లా పెట్టుబడులు పెద్దఎత్తున పెరగటం గమనార్హం.
ఎస్ బ్యాంక్‌లోకి బిలియన్ డాలర్లు
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఎస్ బ్యాంక్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు కార్లైల్, అడ్వెంట్ సంస్థలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఎస్ బ్యాంక్ సీనియర్ మేనేజర్లతో చర్చోపచర్చలు జరుపుతున్నాయి. హాంకాంగ్ కంపెనీ అయిన కార్లైల్.. అడ్వెంట్‌తో కలిసి స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎస్ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారు ఎస్‌బీఐ కావటంతో ఈ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ పొందటానికి ఆ బ్యాంక్ అనుమతి కూడా అవసరమే. ఇదిలాఉండగా ఈ పెట్టుబడి ప్రణాళికను దశలవారీగా అమలుచేయాలని భావిస్తున్నారు.
read more: Hyderabad: మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రం. ప్రపంచంలోనే తొలిసారి!
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఈ వారాంతాన్ని స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,600 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఆటోమొబైల్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు అధిక లాభాలు వచ్చాయి. మిగతా రంగాల కన్నా వీటికి ఒక శాతం వరకు ఎక్కువే ప్రాఫిట్స్ రావటం విశేషం. లాభాలు ఆర్జించిన కంపెనీల లిస్టులో ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్‌ఈ)లో మిడ్, స్మాల్ క్యాప్‌లకు 0.5 శాతం వరకు లాభం వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జీఎస్‌ఎఫ్‌సీ) నికర లాభం రెట్టింపు కానుందనే అంచనాల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు 8 శాతానికి పైగా లాభాలు సంపాదించాయి. 2022 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో జీఎస్‌ఎఫ్‌సీకి 137.76 కోట్లు మాత్రమే నికర లాభం రాగా 2023 ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో రెట్టింపు (355.83 కోట్ల) లాభం వస్తుందని అంచనా వేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!