Business Flash: యూజర్లు తగ్గినా.. పెరిగిన షేర్లు
స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌కి యూజర్లు తగ్గినా షేర్లు పెరగటం విశేషం. 9 లక్షల 70 మంది సబ్‌స్క్రైబర్ల తగ్గుతారని సెకండ్ క్వార్టర్ ఆదాయ నివేదికలో వెల్లడించింది. ఫస్ట్ క్వార్టర్‌లో 2 లక్షలు తగ్గొచ్చన్న అంచనాలతో పోల్చితే ఇది తక్కువే కావటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో రెండు లక్షల ఖాతాలు తగ్గటంతో ఈ సంస్థ షేర్లు దాదాపు 67 శాతం పడిపోయాయి. అయితే.. తాజా ఫలితాలతో నెట్‌ఫ్లిక్స్ స్టాక్స్ 7 శాతం పెరగటం చెప్పుకోదగ్గ విషయం. దీంతో 216 డాలర్ల ఆదాయం సమకూరింది. నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు నిబంధనలను మారుస్తుండటంతోపాటు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను పెంచుతుండటంతో యూజర్లు విసుగెత్తిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గటానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు.
టాప్ లెవల్‌లో తెలంగాణ
నీతి ఆయోగ్ ఇవాళ విడుదల చేసిన 2021 ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ థర్డ్ ఎడిషన్‌లో తెలంగాణ, కర్ణాటక, హర్యానా అగ్ర స్థానంలో నిలిచాయి. మేజర్ స్టేట్స్ కేటగిరీలో కర్ణాటకకు అగ్ర స్థానం లభించింది. ఈ విభాగంలో గతంలోనూ ఆ రాష్ట్రమే టాప్‌లో నిలవటం ప్రస్తావనార్హం. తాజా నివేదికలో రెండు, మూడు స్థానాల్లో తెలంగాణ, హర్యాణా ఉన్నాయి. రాష్ట్రాల ఆవిష్కరణల సంసిద్ధతకు ఇదో సంకేతమని చెప్పొచ్చు. ఈ విషయంలో వివిధ రాష్ట్రాల పనితీరును నీతి ఆయోగ్ విశ్లేషించి ఇండెక్స్‌ను తయారుచేస్తుంది.
read also: Rythu Bima: రైతు బీమా ఇవ్వనందుకు ఎల్‌ఐసీకి రూ.50 వేల జరిమానా, వడ్డీ
12 శాతం తగ్గిన విప్రో నికర లాభం
మన దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రోకి ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో నికర లాభం 12 శాతం తగ్గింది. అమెరికాయేతర క్లయింట్లలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొనటమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనూ విప్రో 18 పెద్ద డీల్స్ కుదుర్చుకోవటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఒప్పందాల మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లు. దీంతో లాభాల మార్జిన్లపై ఒత్తిళ్లు ఇకపై ఉండబోవని విప్రో ప్రకటించింది.
