Site icon NTV Telugu

BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ మామూలుగా లేవు

Bsnl

Bsnl

BSNL Recharge Plan: ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే BSNL వెనకబడిపోయిందనే ఒకప్పటి మాట. కొత్తగా గట్టిగా చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికాం కంపెనీలకు పోటీ ఇచ్చే స్థాయికి దినదినం ఎదుగుతుంది. కంపెనీ తన కవరేజీని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తతం టెలికాం మార్కెట్లలో వివిధ కంపెనీల మధ్య కస్టమర్లను ఆకర్షించడంపై గట్టి పోటీ నెలకొంది. వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు వారి కోసం కొత్త ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజా BSNL తన కస్టమర్ల కోసం కూడా అలాంటి ఓ ప్లాన్‌ తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Thanuja Puttaswamy : నాన్న మూడేళ్లు మాట్లాడలేదు.. చేదు ఘటన చెప్పిన తనూజ

తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలు..
బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ప్రత్యర్థి టెలికాం కంపెనీలతో పోల్చితే తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్ తీసుకొస్తూ ఎక్కువ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తుంది. ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ దేశ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. అలాంటి ప్లాన్‌నే కొత్తగా మరొకటి తీసుకొచ్చి తమ వినియోగదారులకు కంపెనీ స్వీట్ సప్రైజ్ ఇచ్చింది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా అపరిమిత కాలింగ్, ఇంటర్నెట్ డేటాను దీర్ఘకాల చెల్లుబాటుతో కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించారు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 319.

రూ.319 రీఛార్జ్ ప్లాన్‌తో మొత్తం 65 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందడంతో పాటు, మొత్తం 10 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. మెసేజింగ్ కోసం 300 SMSలు కూడా లభించనున్నాయి. దీర్ఘకాలిక చెల్లుబాటుతో కూడిన ఉత్తమ, చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు మంచి ఎంపిక కావచ్చు. ఒక లుక్ వేయండి.

READ ALSO: Canara Bank Recruitment 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ లేకుండానే జాబ్

Exit mobile version