Boeing: ఉద్యోగులకు బోయింగ్ షాక్.. 17 వేల మందిపై వేటు
- ఉద్యోగులకు బోయింగ్ షాక్
- 17 వేల మందిపై వేటు వేయనున్న సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ నిర్మాణాత్మక మార్పులకు సిద్ధమైంది. రాబోయే నెలల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. శ్రామిక శక్తిలో 10 శాతం తగ్గుతుందని ప్రకటించింది. దీంతో దాదాపు 17,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, ఉద్యోగులపై తొలగింపు ప్రభావం చూపుతుందని బోయింగ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ తెలిపారు. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఏకంగా 17వేల మంది సిబ్బందిపై వేటు వేయనుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగించనుంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరికొత్త వ్యూహం.. ఆ రూట్లలో వెళ్తే బాదుడే!
Also Read
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
- Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్‌ఫామ్స్ పగ్గాలు!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
సియాటెల్ ప్రాంతంలో 33,000మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో 737 MAX, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సీఈఓ కెల్లీ ఓర్ట్బర్గ్ అన్నారు. రానున్న నెలల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10శాతం మందిని తగ్గించాలని చూస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఉండనున్నారని ఆయన తెలిపారు.
సమ్మె ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 777X జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నట్లు బోయింగ్ తెలిపింది. 2026లో వీటి డెలివరీలు అందిస్తామని వెల్లడించింది. ప్రస్తుత ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత 2027లో 767 ఫ్రైటర్ ఉత్పత్తిని నిలిపివేయాలని బోయింగ్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో బోయింగ్ షేర్లు 1.1శాతం క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Dollar Rupee Exchange Rate: పెరిగిన డాలర్ బలం.. కనిష్ట స్థాయికి చేరిన “రూపాయి”.. కారణాలు?
తాజావార్తలు
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్‌షీట్’ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?