Site icon NTV Telugu

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Gold Rates

Gold Rates

పసిడి ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలకు గురువారం బ్రేకులు పడ్డాయి. దీంతో తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ పైపైకి వెళ్లిపోతున్నాయి. శుక్రవారం బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించాయి. నేడు తులం బంగారం ధరపై రూ.771 పెరిగింది. అలాగే సిల్వర్ ధర కూడా హడలెత్తిస్తోంది. కిలో వెండిపై రూ.2,100 పెరిగింది.

ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: 2 నెలల తర్వాత రాష్ట్రపతి భవన్‌లో జగదీప్ ధన్‌ఖర్ ప్రత్యక్షం

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 771 పెరిగి రూ.1, 11, 280 దగ్గర అమ్ముడవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.700 పెరిగి రూ.1,02,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.580 పెరిగి రూ.83, 460 దగ్గర అమ్ముడవుతోంది. ఇక కిలో వెండిపై రూ.2,100 పెరిగి రూ.1, 32, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.1,42, 000 అమ్ముడవుతుండతా.. కోల్‌కతా, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో మాత్రం రూ.1,32,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Congress Vs BJP: మోడీని తల్లి హెచ్చరిస్తున్నట్లు ఏఐ వీడియో విడుదల.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆగ్రహం

Exit mobile version