Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Best Income %e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81 %e0%b0%8e%e0%b0%95%e0%b0%b0%e0%b0%82 %e0%b0%b0%e0%b1%82 15 %e0%b0%b5%e0%b1%87%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81 %e0%b0%a8

Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..

Published Date :March 14, 2026 , 8:59 pm
By Veerababu
  • తలుపు తట్టిన అదృష్టం..
  • రూ.30 వేలు పలికిని రెండు ఎకరాలు నేడు రూ.25 కోట్లు..
  • ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా నెలకు రూ.14.50 లక్షల ఆదాయం..
Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తుకు భద్రతను ఇస్తాయని చాలామంది నమ్ముతారు. పెద్దలు కూడా తమ పిల్లలకు ఎప్పుడూ ఒక చిన్న స్థలాన్నయినా కొని ఉంచమని.. అది ఎప్పటికైనా మీకు ఆదుకుంటుందని పదే పదే సూచిస్తుంటారు. ఈ మాటలు ఎంత నిజమో నిరూపించే ఒక ఆసక్తికరమైన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయిన స్వప్నిల్ కొమావర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 36 ఏళ్ల క్రితం అంటే 1990వ సంవత్సరంలో ఆయన మేనమామ తన సొంత ఊరిలో నాలుగు ఎకరాల భూమిని రూ. 60 వేలకే కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ భూమి విలువ అంతంత మాత్రమే. అయితే, కాలక్రమంలో ఆ ఊరు కొత్త జిల్లా కేంద్రంగా మారడం, చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

Also Read:Google Map: గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు..

ఈ మార్పుల వల్ల ఆ భూమికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని గమనించిన ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘డీ-మార్ట్’, ఆయన వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాలను రూ. 25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ మొత్తంతో ఆ వ్యక్తి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ రూ. 25 కోట్లను ఆయన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడిగా పెట్టారు. దీని ద్వారా ప్రస్తుతం ఆయనకు నెలకు దాదాపు రూ. 14.50 లక్షల వడ్డీ ఆదాయం వస్తోంది. విశేషం ఏమిటంటే, ఇంకా రెండు ఎకరాల స్థలం ఆయన వద్దనే మిగిలి ఉంది.

ఈ కథనం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భూమిని దశాబ్దాల పాటు కాపాడుకోవడం సామాన్యమైన విషయం కాదని, ఆయన ఓపికకు ఫలితం దక్కిందని నెటిజన్లు ప్రశంసించారు. అయితే.. ఇంత భారీ మొత్తానికి వచ్చే పన్నులు, ఇతర ఖర్చుల గురించి కూడా కొందరు నెటిజన్లు ఆసక్తికరంగా ప్రశ్నించారు. మొత్తానికి.. సరైన సమయంలో చేసిన పెట్టుబడి, దానికి కాలం కలిసి రావడం ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • D-Mart land purchase news
  • land investment success story India
  • long term land investment India
  • real estate investment story
  • Swapnil Komawar real estate story

తాజావార్తలు

  • Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..

  • Chinmayi: కమల్ హాసన్’పై చిన్మయి సంచలన కామెంట్స్

  • Google Map: గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త విప్లవం.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు..

  • Movie Shootings: సినిమా షూటింగ్’లపై గ్యాస్ గుది బండ

  • Fastag: వాహనాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త ధరలు..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions