భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో టాప్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆర్థికంగా ప్రపంచంలో మెరుగైన స్థానంలో ఉంది. ఇక దేశంలో ఆయా ప్రధాన నగరాలు ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో దూసుకుపోతున్నాయి. ఇందులో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహా నగరాలు ఉన్నాయి. ఇక బెంగళూరు విషయానికి వస్తే.. ఐటీ రంగానికి మంచి పేరే ఉంది. బెంగళూరును టెక్ సిటీగా పిలుస్తారు. అలాంటి బెంగళూరు పేరు మరో విషయంలో మార్మోగుతోంది.
కండోమ్స్ అమ్మకాల్లో బెంగళూరు టాప్‌లో ఉందని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ పేర్కొంది. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్య అత్యంత రహస్యంగా కండోమ్స్ సేల్ అవుతున్నాయని తెలిపింది. అటు తర్వాత స్థానంలో ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఉన్నట్లుగా పేర్కొంది. రాత్రి 10 గంటల తర్వాత ఎక్కువగా కండోమ్‌లే కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపింది. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇవే ఎక్కువగా కొంటున్నట్లుగా వెల్లడించింది. 140 ఆర్డర్స్‌లో సెక్స్ వెల్నెస్ ఐటెమ్ ఉంటుందని తెలిపింది. బెంగళూరు వాసులు కండోమ్స్ ఎక్కువగా కొనుగోలు చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదికలో తెలిపింది.
ఆన్‌లైన్ షాపింగ్‌లో కిరాణా సామాగ్రితో పాటు నిత్యవసర వస్తువులను వేగంగా డెలివరీ చేస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 10 గంటల తర్వాత కండోమ్స్‌తో పాటు మసాలా ఫ్లేవర్స్ చిప్స్, కుర్కురే, ఫ్లేవర్డ్ కండోమ్‌లు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ రహస్య వస్తువులున్నీ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.