Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా?
- సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
- వైరల్ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవులు అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసినట్లుగా ఒక గెజిట్ చక్కర్లు కొడుతోంది. ఎస్బీఐతో సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటించిందని వార్త హల్చల్ చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నకిలీ వార్తగా కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఇలాంటి నోటిఫికేషన్ ఏదీ జారీ కాలేదని వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలోని బ్యాంకులకు ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు సెలవు ఉంటుంది. మొదటి, మూడో, ఐదో శనివారాలు సాధారణంగా బ్యాంకులు పనిచేసే రోజులు. అందువల్ల ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుందన్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకులకు సంబంధించిన ఈ ఫేక్ నోటిఫికేషన్ వైరల్ కావడానికి మరో కారణం ఇటీవల జరిగిన పరిణామాలు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే బ్యాంక్ యూనియన్లతో జరిగిన చర్చల తర్వాత సమ్మెను వాయిదా వేశారు.
Also Read
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
- LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య జరిగిన చర్చల అనంతరం సెప్టెంబర్ 28–30 తేదీల్లో నిర్వహించాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేశారు. పెండింగ్‌లో ఉన్న పలు అంశాలతో పాటు ఐదు రోజుల బ్యాంకింగ్ వర్కింగ్ వీక్ డిమాండ్‌పై చర్చించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే దీనర్థం ప్రస్తుతం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించినట్లు కాదని PIB Fact Check స్పష్టం చేసింది.
నకిలీ పత్రం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ పత్రంపై సెప్టెంబర్ 30, 2026 తేదీ ఉంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం తక్షణమే సెలవుగా ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఆ పత్రం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది కాదని PIB Fact Check వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారం కనిపిస్తే దాన్ని ధృవీకరణ కోసం ఫ్లాగ్ చేయాలని ప్రజలకు సూచించింది. కాబట్టి ప్రస్తుతం అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవులు కావు. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సాధారణ సెలవు కొనసాగుతోంది.
A Gazette circulating on social media , purportedly issued by the Ministry of Finance (Department of Financial Services), claims that the Central Government has declared every Saturday a public holiday for all Public Sector Banks , including SBI.
#PIBFactCheck:
❌ The document being circulated is #Fake.
✅ No such notification has been issued by @FinMinIndia declaring every Saturday as public holiday for public sector banks.
💡 Flag suspicious content related to the Central Government to PIB Fact Check.
📱 WhatsApp: +91 8799711259
📧 factcheck@pib.gov.in— PIB Fact Check (@PIBFactCheck) October 1, 2026
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?