APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APY Monthly Pension: రేపటి గురించి ఆలోచించని వారికి నేటి పొదుపే శ్రీరామరక్ష. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా, గౌరవప్రదంగా జీవించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో.. జీవితాంతం హామీతో కూడిన పెన్షన్ అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే అటల్ పెన్షన్ యోజన (APY) పథకం అసంఘటిత రంగ కార్మికులకు, సామాన్యులకు ఇది ఎలా వరంగా మారుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఏమిటి ఈ పథకం?
అటల్ పెన్షన్ యోజన పట్ల ప్రజల్లో అవగాహన, ఆదరణ ఈ రోజుల్లో పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. దేశంలో సామాజిక భద్రతను పెంచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు చేరవచ్చు. మీరు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయస్సు తర్వాత ప్రతి నెలా రూ.1,000 – రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ డెబిట్ సౌకర్యం ఉండటం వల్ల చెల్లింపులు కూడా చాలా సులభం.
Also Read
- FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
- PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
పెట్టుబడి ఎంతంటే..
నెలవారీ పెన్షన్ రూ.5,000 పొందాలనుకుంటే, మీరు చేరిన వయస్సును బట్టి పెట్టుబడి మారుతుంది. మీరు 18 ఏళ్లకే ప్రారంభిస్తే.. నెలకు కేవలం రూ.210 చెల్లిస్తే సరిపోతుంది. 30 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.577 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 40 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే నెలకు రూ.1,454 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే.. ఎంత త్వరగా ప్రారంభిస్తే, నెలవారీ భారం అంత తక్కువగా ఉంటుంది. APY కేవలం మీకే కాదు, మీ కుటుంబానికి కూడా భరోసా ఇస్తుంది. పెన్షన్ దారుడు మరణిస్తే, అదే పింఛను మొత్తం జీవిత భాగస్వామికి (భార్య/భర్త) అందుతుంది. ఇద్దరూ మరణిస్తే దాదాపు రూ.8.5 లక్షల కార్పస్ నిధిని నామినీకి అందజేస్తారు. ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల లోపు భారతీయులందరూ ఈ పథకంలో చేరవచ్చు.
తాజావార్తలు
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?