Site icon NTV Telugu

Apple Warning: యాపిల్ హెచ్చరిక.. ఐఫోన్, ఐప్యాడ్‌లలో భద్రతా లోపాలు

Apple Phone

Apple Phone

Apple Warning: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌లలో భద్రతాపరమైన లోపాలు తలెత్తవచ్చని టెక్ దిగ్గజం యాపిల్ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఈ పరికరాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ లోపాల అంశంపై వచ్చిన నివేదికపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు భద్రతా లోపాలపై యాపిల్ రెండు నివేదికలను విడుదల చేసింది. సఫారీతో పాటు యాపిల్ బ్రౌజర్ వెబ్‌కిట్‌లో రెండు బగ్‌లు ఉన్నట్లు యాపిల్ నివేదించింది.

Read Also: Reliance Jio plans: కొత్త ప్లాన్స్‌ తెచ్చిన జియో.. రోజుకి 2 జీబీ డేటా, ఓటీటీ ఆఫర్లు సహా మరిన్ని..!

కాగా భద్రతా ముప్పు ఉన్న ఐఫోన్ 6ఎస్, ఆ తర్వాతి మోడళ్లు, అన్ని ఐప్యాడ్ ప్రో మోడళ్లు, ఐప్యాడ్ ఎయిర్ 2, మ్యాక్ ఓఎస్ మాంటెరీపై నడుస్తున్న మ్యాక్ కంప్యూటర్లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా వినియోగదారులకు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వివరణ ప్రకారం ఈ పరికరాలపై హ్యాకర్లు పూర్తి పట్టు చేపట్టే ప్రమాదం ఉందని.. వారికి నచ్చినట్లు సాఫ్ట్‌వేర్‌ను యాక్సిస్ చేసే అవకాశం ఉందని సోషల్ ప్రూఫ్ సెక్యూరిటీ సీఈవో రాచెల్ టొబాక్ వెల్లడించారు. అటు అన్ని డివైస్‌లలో ప్యాచ్డ్ వెర్షన్‌ అందుబాటులో ఉంటుందని యాపిల్ తెలిపింది. ఈ మేరకు ఐవోఎస్ 15.6.1, మ్యాక్ ఓఎస్ మాంటెరీ 12.5.1, ఐప్యాడ్ ఓఎస్ 15.6.1 అప్ డేట్స్ భారత్ లో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యాపిల్ సంస్థ ప్రకటించింది. అయితే ఎక్కడ, ఎవరి ద్వారా లోపాలను గుర్తించిందన్న విషయంపై యాపిల్‌ స్పష్టత ఇవ్వలేదు.

Exit mobile version