Site icon NTV Telugu

Apple Pay: ఫోన్ పే, గూగుల్ పేకు ధీటుగా “ఆపిల్ పే”.. త్వరలో భారత్‌లోకి ఎంట్రీ..

Apple Pay

Apple Pay

Apple Pay: గూగుల్ పే, ఫోన్ పే ప్రస్తుతం భారతదేశంలో యూపీఐ లావాదేవీల్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. ప్రజలు వీటి ద్వారానే ఎక్కువగా క్యాష్ లెస్ లావాదేవీలు నడుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రముఖ మొబైల్ ఫోన్ల దిగ్గజం ఆపిల్ కూడా తన పేమెంట్ ఫీచర్ ‘ఆపిల్ పే’ను భారత్‌లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే సంబంధిత సంస్థలైన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో చర్చలు జరుపుతోంది.

Read Also: Heat Strokes Killes: వడ దెబ్బకు బీహార్‌, యూపీలో ఎక్కవ మరణాలు … 10 ఏళ్లల్లో 2500 మంది మరణం

ఆపిల్ పే రంగంలోకి దిగితే .. ప్రస్తుతం పేమెంట్ యాప్స్ లో మెజారిటీ షేర్ కలిగిన ఫోన్ పే, గుగూల్ పే, వాట్సాప్ పే, పేటీఎం వంటి వాటితో పోటీలో నిలవాల్సి ఉంటుంది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇప్పటికే ఆపిల్ పే కోసం పలుమార్లు భారత అధికారులతో సమావేశమయ్యారు. వినియోగదారులు క్యూఆర్ కోడ్లను ఉపయోగించి, థర్డ్ పార్టీ సహాయం లేకుండా యూపీఐ లావాదేవీలను ఈ చేయవచ్చు. ఫేస్ ఐడీ ఫీచర్‌ని కూడా ఉపయోగించి యూజర్లు యూపీఐ లావాదేవీలు చేసేలా నిర్ధారించాలని ఆపిల్ కోరుతుంది. ఈ ఏడాది మార్చి నెలలో అమెరికాలో ‘ఆపిల్ పే లాటర్’ సర్వీస్ ప్రారంభించింది. ‘ బై నౌ పే లాటర్’ సర్వీసు ప్రారంభించింది. అయితే ఇది కొంతమంది సెలెక్టడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Exit mobile version