Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
- జూలై 6 బోర్డు మీటింగ్‌పైనే అందరి కళ్లు
- 5 ఏళ్లలో 3,847 శాతం బంపర్ రిటర్న్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apollo Micro Systems: షేర్ మార్కెట్లో రక్షణ రంగానికి (డిఫెన్స్) చెందిన కంపెనీల షేర్లు వరుస రికార్డులతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డిఫెన్స్ అండ్ ఎరోస్పేస్ కంపెనీ ‘అపోలో మైక్రో సిస్టమ్స్’ (Apollo Micro Systems) ఇన్వెస్టర్లకు ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. జూలై 6 (సోమవారం) న జరగబోయే కంపెనీ బోర్డు సమావేశం వార్తల నేపథ్యంలో.. శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ షేరు 2.39 శాతం వృద్ధితో ముగిసింది. ప్రెఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కంపెనీ భారీగా కొత్త నిధులను సేకరించాలని ప్లాన్ చేస్తుండటమే ఈ జోష్‌కు ప్రధాన కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
జూలై 6 బోర్డు మీటింగ్‌పైనే అందరి కళ్లు
హైదరాబాద్‌లోని తమ రిజిస్టర్డ్ ఆఫీస్‌లో జూలై 6వ తేదీన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కీలక సమావేశం జరగనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమావేశంలో ప్రెఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లు, కన్వర్టిబుల్ సెక్యూరిటీస్ లేదా వారెంట్ల జారీ ద్వారా ఫండ్స్ సేకరించడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. సెబీ (ICDR) రెగ్యులేషన్స్-2018 నిబంధనల ప్రకారం షేర్ల ధర, నిధుల సేకరణ షరతులు ఖరారు కానున్నాయని తెలుస్తోంది. దీనికి షేర్ హోల్డర్లతో పాటు రెగ్యులేటరీ అనుమతులు కూడా తప్పనిసరి కానున్నాయి.
Also Read
- Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
5 ఏళ్లలో 3,847 శాతం బంపర్ రిటర్న్స్
గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ డిఫెన్స్ స్టాక్ ఇన్వెస్టర్లకు ఏకంగా 3,847 శాతం మేర మైండ్ బ్లాకింగ్ రిటర్న్స్ అందించింది. అంటే ఐదేళ్ల క్రితం ఇందులో పెట్టిన రూ.1 లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ఏకంగా రూ.39 లక్షలకు పైగా మారింది. కేవలం గత 3 నెలల్లో 128 శాతం, ఏడాదిలో 136 శాతం, మూడేళ్లలో 803 శాతం లాభాలను అందించి ఈ షేరు టాప్ మల్టీబ్యాగర్‌గా నిలిచింది. కంపెనీ భవిష్యత్తుపై నమ్మకంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) తమ వాటాను మార్చి త్రైమాసికంలోని 3.63 శాతం నుంచి జూన్ నాటికి ఏకంగా 6.21 శాతానికి పెంచుకున్నారు. ప్రస్తుతం ప్రమోటర్ల వద్ద 50.27 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా రక్షణ శాఖ, డీఆర్డీఓ (DRDO), ఇస్రో (ISRO), బెల్ (BEL), హెచ్ఏఎల్ (HAL) వంటి ప్రభుత్వ సంస్థలకు కీలకమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.1,432 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఉండటం వల్ల భవిష్యత్తులో రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫండ్ రైజింగ్ వంటి సున్నితమైన సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు, జూలై 1 నుంచి కంపెనీ ఉద్యోగులు, అధికారుల ట్రేడింగ్ విండోను యాజమాన్యం పూర్తిగా మూసివేసింది. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం, రూ.16,336 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ కంపెనీ పీఈ (P/E) రేషియో 152.11 వద్ద ఉంది. అయితే, డెట్-టు-ఈక్విటీ రేషియో కేవలం 0.41 మాత్రమే ఉండటం.. కంపెనీపై అప్పుల భారం చాలా స్వల్పంగా ఉందనే విషయానికి సంకేతం.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!