బంగారం ధరలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. ఈ వారంలో రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధించారు. ఈ ప్రభావం పసిడిపై తీవ్ర ప్రభావం పడుతోంది. రికార్డ్ స్థాయిలో బంగారం, సిల్వర్ ధరలు పెరిగిపోతున్నాయి. తాజాగా తులం గోల్డ్‌పై రూ.600 పెరిగింది. కిలో వెండిపై రూ.6,000 పెరిగి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక మావో జంట అరెస్ట్.. ఇద్దరిపై రివార్డ్ ఎంతుందంటే..!
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 పెరిగి రూ.1, 15, 480 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.550 పెరిగి రూ.1, 05, 850 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 పెరిగి రూ.86,610 దగ్గర అమ్ముడవుతుంది. ఇక కిలో వెండిపై మాత్రం 6,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,49, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,59,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,49, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bihar: మహిళలకు రూ.10 వేల కానుక ఇప్పుడే ఎందుకు? ఆ 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ ఇదే వ్యూహంతో సక్సెస్ అయిందా?
