NTV Telugu Site icon

పాల ధరలు పెంచేసిన అమూల్.. రేపటి నుంచే వడ్డింపు

Amul

Amul

అమూల్ వినియోగదారులకు చేదు వార్త వినిపించింది… అమూల్‌కు చెందిన అన్ని రకాల పాల బ్రాండ్లపై లీటర్‌కు రూ.2 చెప్పున పెంచేసింది… పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. అన్ని బ్రాండ్లపై పాలపై లీట‌ర్‌కు రూ. 2 చొప్పున పెంచినట్టు గుజ‌రాత్ స‌హ‌కార మిల్క్ మార్కెటింగ్ ఫెడ‌రేష‌న్ (జీసీఎంఎంఎఫ్‌) అధికారి ప్రకటించారు.. అయితే, ఉత్పత్తి వ్యయం పెర‌డమే ధరల పెరుగుదలకు కారణమని.. ఏడాదిన్నర త‌ర్వాత పాల ధ‌ర‌ల‌ను పెంచాల్సి వ‌చ్చింద‌ని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్ఎస్‌ సోధి పేర్కొన్నారు.. ఆవు, బ‌ర్రె పాల‌తో పాటు గోల్డ్‌, తాజా, శ‌క్తి, టీ-స్పెష‌ల్ వంటి అమూల్ మిల్క్ బ్రాండ్స్ అన్నింటికి పెరిగిన ధరలు వర్తించనున్నాయి.. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా వర్తించనున్నాయి..

తాజా ధరల పెంపు తర్వాత అమూల్ గోల్డ్‌ ధర 500 మి.లీకి రూ. 29 ఉండగా, అమూల్ తారా 500 మి.లీకి రూ. 23, అముల్ శక్తి 500 మి.లీకి రూ .26 చొప్పున లభిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు అధికంగా ఉండటం వల్ల మాత్రమే కాదు.. చాలా ముఖ్యమైన ఎఫ్ఎంసిజి ఉత్పత్తుల ధరలు పెరిగాయి. అధిక ద్రవ్యోల్బణం ఫలితంగా వంటనూనె నూనె, సబ్బు, టీ మరియు ప్యాకేజ్డ్ ఆహార ధాన్యాలు వంటి ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి పేర్కొంది జీసీఎంఎంఎఫ్.. అమూల్‌ లోని వివిధ రకరాల మిల్క్‌ బ్రాండ్‌లతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలను కూడా పెరగనున్నాయి.