Site icon NTV Telugu

అమెజాన్ కొత్త సీఈవోకు భారీ వాటాలు…ఎందుకంటే…

అమెజాన్‌ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ లో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.  1997 లో అమెజాన్‌లో చేరిన ఆండీ అంచ‌లంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీలో కీల‌క వ్యక్తిగా ఎదిగారు.  వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్‌కు సాంకేతిక స‌ల‌హాదారుడిగా ఉంటూ నిత్యం ఆయ‌న వెన్నంటే ఉండేవారు.  అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ ప్రారంభ‌మ‌య్యాక, ఆయ‌న బాధ్య‌త మ‌రింత పెరింది.  ప్ర‌స్తుతం ఆయ‌న‌కు కంపెనీలో 45.3 మిలియ‌న్ల విలువైన షేర్లు ఉండ‌గా, ఇప్పుడు అవి 200 మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకోబోతున్నాయి.  ప్ర‌తి ఏడాది ఆండీకి రెండుసార్లు వాటాల‌ను అందించాలి.  కానీ, అమెజాన్ ఆ వాటాలను కొన్ని కార‌ణాల వ‌ల‌న నిలిపివేసింది. సీఈవోగా బాధ్య‌త‌లు అందిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు భారీగా వాటాలు ఇవ్వాల‌ని కంపెనీ నిర్ణ‌యం తీసుకుంది.  200 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన వాటాలు అందివ్వ‌బోతున్న‌ట్టు కంపెనీ ప్ర‌క‌టించింది.  ఈ విధంగా చూసుకున్నా అమెరికాలో టాప్ కంపెనీల సీఈవోల‌కు అందించే వాటాల‌తో పోలిస్తే ఆండీకి అందించిన వాటా త‌క్కువే అని చెప్పాలి. 

Read: ఆమీర్ ఖాన్ ఆఫర్ చేసిన ‘బూతు సినిమా’ రణబీర్ వద్దన్నాడట!

Exit mobile version