ఆమీర్ ఖాన్ ఆఫర్ చేసిన ‘బూతు సినిమా’ రణబీర్ వద్దన్నాడట!

ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ బ్యూటీతోనూ తెరపై రొమాన్స్ చేశాడు. కానీ, ఎందుకో తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. మళ్లీ బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తాడన్న ఆశ కూడా లేదు. అయితే, ఆయన చిన్నపాటి బిగ్ స్క్రీన్ కెరీర్ లో ‘ఢిల్లీ బెల్లి’ పెద్ద సంచలనం!
అభినయ్ డియో డైరెక్షన్ లో రూపొందింది ఇమ్రాన్ ఖాన్ స్టారర్ ‘ఢిల్లీ బెల్లి’. దేశ రాజధానిలో జరిగే ఈ సినిమా స్టోరీ కొంత వరకూ అడల్ట్ కంటెంట్ తో, కామెడీతో ఉంటుంది. దాని వల్ల చాలా రకాల ‘కస్ వర్డ్స్’ వాడాల్సి ఉంటుంది. మెట్రోపాలిటన్ బూతులు పెద్ద తెరపై వాడటం తన వల్ల కాదన్నడట రణబీర్ కపూర్! నిజానికి ఆయనే ‘ఢిల్లీ బెల్లి’ సినిమా నిర్మాత ఫస్ట్ ఛాయిస్ అట! ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు… ఆమీర్ ఖాన్!
అభినయ్ డియోతో ఆమీర్ ఖాన్ ‘ఢిల్లీ బెల్లీ’ సినిమా చేయాలనుకున్నప్పుడు మొదట రణబీర్ నే హీరోగా కోరుకున్నాడట. తన మేనల్లుడు ఇమ్రాన్ ఆయన లిస్ట్ లో తరువాత వచ్చి చేరాడు. ఎందుకంటే, నిర్మాత ఆమీర్, దర్శకుడు అభినయ్ ‘ఢిల్లీ బెల్లి’ స్టోరీ రణబీర్ కి వినిపించగా… ‘’నేను ఈ సినిమా చేస్తే, ప్రీమియర్ షో టైంలో, నా తల్లిదండ్రులతో కలిసి ఎలా చూడగలను?’’ అన్నాడట! రణబీర్ అడల్ట్ కామెడీకి, అసభ్య పదాలకి నో చెప్పటంతో ఆమరీ్ ఖాన్ తన మేనల్లుడ్ని ‘ఢిల్లీ బెల్లి’లోకి తీసుకొచ్చాడు!

Related Articles

Latest Articles