NTV Telugu Site icon

Stock market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Market

Market

దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం వరుస నష్టాలను చవిచూసింది. గత వారం సూచీలు రికార్డులు సృష్టిస్తే.. ఈ వారం అందుకు భిన్నంగా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అన్ని రంగాలు నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు నష్టపోయి 81, 183 దగ్గర ముగియగా.. నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24, 852 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.94 దగ్గర ముగిసింది. దాదాపు రూ.5లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది.

ఇది కూడా చదవండి: Game Changer: దెబ్బకు దిగొచ్చారు.. ఇక ఆ బూతు పంచాంగం ఆపేయండ్రా అబ్బాయిలూ!

నిఫ్టీలో ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, టెలికాం, ఐటీ మొదలగు రంగాలు నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం క్షీణించగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ తాజా రికార్డు గరిష్టాన్ని తాకి 1 శాతం క్షీణించింది.

ఇది కూడా చదవండి: Lavanya: మాల్వీ నా రాజ్ ను వదిలేయ్ ప్లీజ్.. ఈ కష్టం పగవాళ్లకు కూడా రావద్దు!