NTV Telugu Site icon

Akasa Air: వచ్చే నెలలో ‘ఆకాశ’ విమానం టేకాఫ్.. ఫస్ట్ లుక్ విడుదల

Akasa Air

Akasa Air

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బిగ్‌బుల్ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు తక్కువ ఖర్చుకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ‘ఆకాశ’ విమానయాన సంస్థను ఝున్‌ఝున్‌ వాలా ప్రకటించారు. విమానయాన రంగంలో రూ.262 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెలలో ఆకాశ విమానాలు టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆకాశ విమానాలకు సంబంధించిన ఫోటోలను కంపెనీ షేర్ చేసింది.

ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ జూన్‌లో ముంబైలో తన మొదటి విమానాన్ని డెలివరీ తీసుకోనుంది. ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌కు అమెరికాలోని బోయింగ్ పోర్ట్‌‌‌‌ల్యాండ్ ఫెసిలిటీలో తుది మెరుగులు దిద్దుతున్నట్లు సంస్థ తెలిపింది. మరోవైపు ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ తమ లోగోను గత ఏడాదే లాంచ్‌ చేసింది. తన లోగో కోసం సన్‌రైజ్‌ ఆరెంజ్‌తో పాటు పాషనేట్‌ పర్పుల్ రంగులను ఎంచుకుంది. మార్చి 2023 నాటికి 18 విమానాలను నడపాలని ఆకాశ ఎయిర్‌‌‌‌లైన్స్ సంస్థ యోచిస్తోంది. మెట్రో నగరాల నుంచి టైర్‌-2, టైర్‌-3 నగరాల మధ్యే ఈ విమాన సేవలు ఆరంభం అవుతున్నాయి. కాగా ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు గతేడాదే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కమర్షియల్‌ విమానాలు కూడా నడిపించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అత్యాధునిక, బ్రాండ్ న్యూ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థ మార్కెట్లోకి వస్తోంది.