Site icon NTV Telugu

Best Recharge Plans: 90 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్స్.. జియో హాట్‌స్టార్ ఉచితం

Jio

Jio

తరచుగా రీఛార్జ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవడం కంటే మూడు నెలల వ్యాలిడిటీతో వచ్చే రీఛార్జ్ ప్లాన్స్ ను ఎంచుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నారా?. మీలాంటి వారికోసం ఎయిర్ టెల్, జియో టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు సూపర్ బెనిఫిట్స్ తో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టాయి. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా, జియో హాట్ స్టార్ ఫ్రీగా అందిస్తున్నాయి. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కావాలనుకునే వారు ఈ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి.

Also Read:IND vs NZ: చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. స్టేడియంలో ఫైనల్‌ చూస్తూ ఎంజాయ్!

ఎయిర్‌టెల్ రూ. 929 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్ వస్తాయి. ఈ ప్లాన్‌లో స్నాప్ కాల్, SMS అలర్ట్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు యాక్సెస్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హెలోట్యూన్‌లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

Also Read:Harish Rao: రేవంత్‌రెడ్డి మహిళా దినోత్సవ వేడుకల్లో పచ్చి అబద్ధాలు మాట్లాడారు..

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2GB డేటా, 20GB అదనపు డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ లో రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో క్లౌడ్‌తో పాటు అపరిమిత 5G డేటా లభిస్తుంది.

జియో రూ. 195 డేటా ప్యాక్

ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో కస్టమర్లకు మొత్తం 15GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.

Also Read:HCL: కూతురు రోష్ని నాడర్‌కి 47% తన వాటాని గిఫ్ట్‌గా ఇచ్చిన శివ్ నాడార్..

జియో రూ. 100 డేటా ప్యాక్

ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో కస్టమర్లకు మొత్తం 5GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ (మొబైల్/టీవీ) సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.

Exit mobile version