Site icon NTV Telugu

రంగంలోకి ఆదానీ..! పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకు పోటీగా..!

Adani

మ‌రో కొత్త రంగంలోకి అడుగుపెట్ట‌నున్నారు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ… ఇప్ప‌టికే ఏ రంగాన్ని వ‌దిలేది లేదు అన్న త‌ర‌హాలో కొత్త అన్ని రంగంలోకి ఎంట్రీ ఇస్తూ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ వ‌స్తున్నారు ఆదానీ.. త్వరలో విల్మార్ కన్జూమర్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. సిమెంట్ రంగంలో అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన ఆయన… పెట్రో కమికల్, రిఫైనరీ సంస్థను కూడా ఫ్లోట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యూనికార్న్ కంపెనీలపై కూడా దృష్టి సారించారు. టాటా స‌న్స్‌, రిల‌య‌న్స్ వంటి కార్పొరేట్ సంస్థ‌ల‌తోపాటు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే తదితర కొత్త యుగం కంపెనీల‌తో పోటీ ప‌డేందుకు ఆదానీ గ్రూప్ రెడీ అయిపోయింది..

అయితే, ఈ-కామ‌ర్స్ వ్యాపారంలోకి ప్రవేశించే క్రమంలో సూప‌ర్ యాప్‌ను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆదానీ.. ఈ-కామ‌ర్స్‌, ఆన్ లైన్ టికెట్ బుకింగ్‌, రీ చార్జింగ్ స‌ర్వీస్ త‌దిత‌ర సేవ‌ల‌ను త‌న ఖాతాదారుల‌కు అందుబాటులోకి తేవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు వెల్ల‌డించారు.. ఆదానీ గ్రూప్‌కు మిలియన్ల సంఖ్యలో క‌న్జూమ‌ర్లు ఉన్నార‌ని.. అది త‌మ‌కు బాగా క‌లిసి వ‌స్తుంద‌ని ఆదానీ గ్రూప్ భావిస్తోంది. కాగా, డిజిట‌ల్ పేమెంట్స్ క్ర‌మంగా పెరుగుతూ పోతోన్న త‌రుణంలో.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భార‌త్ పే.. ఇలాంటి వాటి ప్రాముఖ్య‌త పెరిగిపోయింది.. ఇప్పుడు ఈ రంగంలోకి అదానీ గ్రూప్ కూడా అడుగుపెట్ట‌నుంది.

Exit mobile version