NTV Telugu Site icon

Bigg Boss 6: ఈ వారం ఇంటి నుంచి వంటలక్క అవుట్.. !!

Bigg Boss 6

Bigg Boss 6

Bigg Boss 6: తెలుగులో బిగ్‌బాస్-6 ఆరో వారాంతానికి చేరింది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ఎలిమినేషన్ చేపట్టలేదు. రెండో వారం షానీ, అభినయశ్రీ, మూడో వారం నేహా శర్మ, నాలుగో వారం ఆరోహి, ఐదో వారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేష‌న్‌లో 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో శ్రీహాన్‌, బాలాదిత్య, శ్రీస‌త్య, గీతూ రాయ‌ల్‌, కీర్తి భట్, ఆది రెడ్డి, సుదీప‌, రాజ‌శేఖ‌ర్‌, మెరీనా ఉన్నారు. వీరిలో శనివారం ఎపిసోడ్‌లో శ్రీసత్య సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. మిగతా వారిలో ఓటింగ్ ప్రకారం శ్రీహాన్, ఆదిరెడ్డి, గీతూ కూడా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. కీర్తి భట్, రాజశేఖర్ కూడా సేఫ్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే ముగ్గురు మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారు. వాళ్లే సుదీప, బాలాదిత్య, మెరీనా.

Read Also: Nikhil: కార్తికేయ 3 చేయకపోతే ఆమె నన్ను వదలదు

అయితే వీరిలో చివరి వరకు బాలాదిత్య, సుదీప మధ్య టఫ్ ఫైట్ నడిచినట్లు సమాచారం అందుతోంది. ఓటింగ్ ప్రకారం సుదీప్ ఎలిమినేట్ అయ్యిందని టాక్ నడుస్తోంది. ఈ వారం బాలాదిత్య తన సిగరెట్లను శాక్రిఫైస్ చేసి హౌస్‌మేట్లకు బ్యాటరీ రీఛార్జ్ అవకాశాన్ని కల్పించాడు. అటు సుదీప కేవలం వంటింటికి పరిమితమై ఆటను సరిగ్గా ఆడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నాగార్జున కూడా పలుమార్లు చెప్పి హెచ్చరించాడు. అయినా సుదీప పెద్దగా గేమ్‌పై దృష్టి సారించినట్లు కనిపించలేదు. దీంతో బిగ్‌బాస్ కూడా ఆమెను బయటకు పంపడానికే నిర్ణయించుకున్నాడు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే ఆదివారం నాటి పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.