Pallavi Prashanth: పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ విన్నర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.. ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి పాపం రైతు బిడ్డ రిమాండ్ కు వెళ్లాడు.. ఆ తర్వాత బయటకు వచ్చాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడనే సందేహం చాలామందికి వస్తుంది.. తాజాగా ప్రశాంత్ పాలిటిక్స్ లోకి రాబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..
పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగానే యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగా ఫెమస్ అయ్యాడు.. వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేసేవాడు. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునేవాడు. తల్లికి సాయం చేస్తూ ఇల్లు వాకిలి ఊడుస్తున్న ఆ వీడియోలు కూడా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేవాడు.అయితే బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ కధ మారిపోయింది. బిగ్ బాస్ గా విన్నర్ అయిన ప్రశాంత్ ఇప్పుడు అతని కి వచ్చిన క్రేజ్ కారణంగా గొప్పగా ఉండాలని అనుకోలేదు.. ఎటువంటి గర్వం లేకుండా మామూలుగానే ఉన్నాడు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక సమయానికి తగ్గట్లు అతను గెటప్ లను మారుస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే.. తాజాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ ఈవెంట్ కు హాజరయ్యాడు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ తన జీవితం గురించి ఆసక్తి కర విషయాలను చెప్పాడు.. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆత్మవిశ్వాసంతో సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను. ఇప్పుడిలా మీ ముందు ఇలా తిరుగుతున్నాను. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే నేను భయపడేది లేదు. అస్సలు వెనక్కు వెళ్లను. ఇలాగే గట్టిగా నిలబడతాను. రైతుబిడ్డ తల్చుకుంటే ఏదైనా సాధిస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.. శివాజీ పార్లమెంట్ కు కూడా వెళ్తాడు అని అనడంతో.. ప్రశాంత్ మీ అభిమానం ఉంటే అదికూడా జరగచ్చు అన్నాడు.. దాంతో పల్లవి ప్రశాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.. ఇదే నిజమైతే మరో బర్రెలక్క అవుతాడని ఆయన అభిమానులు చెబుతున్నారు.. మరి పల్లవి ప్రశాంత్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?