NTV Telugu Site icon

Bigg Boss 8 : మరో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఔట్.. ఈసారి ఎవరంటే?

Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu

Bigg Boss 8:బిగ్‌బాస్ సీజన్​ 8 తొమ్మిదో వారం చివరకు వచ్చేయడంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా? అనే టెన్షన్ నెలకొంది. సీజన్​ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హౌస్​ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ కాగా ఈ వారం ఎవ‌రు ఇంటికి వెళ్లనున్నారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. మరి ఈ వారం నామినేషన్స్​లో గౌతమ్, యష్మీ, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని ఉన్నారు. సోమవారం నాడు నామినేషన్స్​ జరగగా.. ఆ రాత్రి నుంచే మొదలైన ఓటింగ్​ ప్రక్రియ శుక్రవారం పూర్తవగా అన్​అఫీషియల్​ ఓటింగ్​లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి. యష్మీ,గౌతమ్, నయని పావని, టేస్టీ తేజ, హరితేజ వరుసగా ఓట్లు తెచ్చుకున్నారు.

Also Read: Varun Tej: లావణ్య ప్రస్తావన.. రిపోర్టర్ కి వరుణ్ తేజ కౌంటర్

చివరి మూడు స్థానాల్లో ఉన్న నయని పావని, టేస్టీ తేజ, హరితేజ మధ్య ఎలిమినేషన్​ జరగనున్నట్లు ముందు నుంచి అంచనాలు ఉండగా టేస్టీ తేజ ఎంటర్​టైన్​మెంట్​ పరంగా, టాస్కుల పరంగా ఉపయోగపడతాడు కాబట్టి అతన్ని సేవ్ చేశారని అంటున్నారు. నయని పావని, హరితేజ వీళ్లిద్దరిలోనే ఒకరు ఇంటికి వెళ్లనున్నారని టాక్ ఉండగా వీళ్లిద్దరి మధ్యే ఎలిమినేషన్​ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం లీక్స్ రాగా నయని ఎలిమినేట్​ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది అఫీషియల్​గా తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే..

Show comments