NTV Telugu Site icon

Maadhavi Latha: బిగ్ బాస్ లో వాళ్లని పెడితే .. ఎవడు దేకను కూడా దేకడు

Madhvi

Madhvi

Maadhavi Latha: నచ్చావులే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ఆ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఫేమస్ అయ్యింది. ఆ తరువాత తనను సోషల్ మీడియాలో కొంతమంది వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇక మూడు రోజుల క్రితం పెళ్లి గురించి ఒక నెటిజన్ ఘాటు ఆరోపణలు చేయడంతో అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఒక వీడియో షేర్ చేసింది. నా పెళ్లి గురించి మీకెందుకు.. ? పెళ్లి చేసుకోకపోతే వచ్చిన నష్టం ఏమైనా ఉందా.. ? పెళ్లి చేసుకొనివారు మనుషులు కాదా.. ? అంటూ ఏకిపారేసింది. అంతేకాకుండా బలుపు ఎక్కి.. కొవ్వెక్కి.. బయట తిరుగుతున్నట్లు చెప్పుకొస్తున్నారని ఆమె మండిపడింది. తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో తెలుసు అని, తనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ భామ బిగ్ బాస్ గురించి ఘాటు ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ 2 నుంచి ఆమెకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినా కూడా తనకు ఇంట్రెస్ట్ లేక వెళ్లలేదని చెప్పుకొచ్చింది.

Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?

ఇక తాజాగా ఒక నెటిజన్ ఆమెను బిగ్ బాస్ చూస్తున్నారా.. ? అన్న ప్రశ్నకు ఆమె ఓ రేంజ్ లో సమాధానం ఇచ్చింది.”బిగ్ బాస్ షో 100 శాతం కమర్షియల్. అందులో సామాన్యులను తీసుకోవాలనేది ఓ సోది టాపిక్. వారిని పెడితే ఎవరూ చూడరు. టీఆర్పీ అస్సలు రాదు. అందుకే పిచ్చి ఆలోచనలు మానేసి చూసేటోళ్లు చూడండి. ఎవరినీ హౌస్‌లో పెడితే చూస్తారో వాళ్లనే తీసుకుంటారు. ఈ సీజన్‌లో చాలామందిని ట్రై చేశారు. మీ పైసలు, పబ్లిసిటీ మాకొద్దు. మాకు ఇజ్జత్ ముఖ్యం అంటూ చాలామంది బిగ్‌బాస్‌కు బైబై అన్నారు. అందుకే ఉన్నావాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు. థ్యాంక్‌ యూ..” అంటూ పోస్ట్ చేసింది. సామాన్యులు అంటే.. ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ వచ్చాడు. దీంతో అతడి గురించే అమ్మడు మాట్లాడింది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments