NTV Telugu Site icon

Bigg Boss 6: తొలి కెప్టెన్ బాలాదిత్య.. ఆఖరి కెప్టెన్ ఇనయా సుల్తానా

Inaya Sulthana

Inaya Sulthana

Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హౌస్‌లోకి వస్తున్నారు. పలువురు కంటెస్టెంట్లకు చెందిన కుటుంబసభ్యుల ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆదిరెడ్డితో మొదలైన ఫ్యామిలీ వీక్ రేవంత్‌తో ముగిసింది. ఈ తతంగం పూర్తి కాగానే బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉండడంతో అందరూ ఇంటి కెప్టెన్ అయ్యేందుకు పోటీపడొచ్చని బిగ్‌బాస్‌‌ చెప్పడంతో అందరూ పోటీ పడ్డారు. ఒక బంతిని సర్కిల్ మధ్యలో పెట్టి చుట్టూ ఇంటి సభ్యులంతా నిల్చున్నారు. ఎవరైతే ఆ బంతిని దక్కించుకుని పరిగెడతారో వారు ఆటలోనుంచి ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చు. అలా ఒక్కొక్కరూ ఎలిమినేట్ కాగా చివరికు కీర్తి, శ్రీసత్య, ఇనయా మిగిలారు. ఇందులో సపోర్ట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ లేకపోవడంతో ఇనయా సుల్తానా గట్టిగా ఆడి కెప్టెన్ పదవి దక్కించుకుంది.

Read Also: Panchathantram: ఐదు జంటల కథతో అదిరిన ట్రైలర్!

కాగా బిగ్‌బాస్-6లో ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ అని ఎనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. దీంతో ఈ సీజన్‌కు సంబంధించి తొలి కెప్టెన్ బాలాదిత్య కాగా చివరి కెప్టెన్‌గా ఇనయా సుల్తానా నిలిచింది. పరిస్థితి ఏదైనా, అనుకున్నది చెప్పడం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఇనయా సుల్తానాను ప్రేక్షకులకు దగ్గర చేసింది. పైగా ఇంట్లో చాలా మంది టార్గెట్‌ చేయడం కూడా ఆమెకు బాగా కలిసొచ్చింది. తన తల్లి వచ్చిన మరుసటి రోజే ఇనయా కెప్టెన్ కావడం విశేషం. ఇంట్లో ప్రస్తుతం 9 మంది ఉన్నారు. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్-6 సీజన్ ముగియనుండటంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో వేచి చూడాలి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈవారం రోహిత్ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది.

Read Also: Team India: టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ దొరికేశాడా?

Show comments