NTV Telugu Site icon

Bigg boss 6: ఆ ఇద్దరి విషయంలో బిగ్‌బాస్ యూటర్న్

Bigg Boss 6

Bigg Boss 6

Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ఐదోవారం నామినేషన్స్‌లో రసవత్తర ఘట్టానికి తెర లేపారు. ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని ఇద్దరేసి కంటెస్టెంట్స్ ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి వారిలో ‘ఎవరు నామినేట్ కావాలి, ఎవరు సేఫ్ జోన్ లో ఉండాలి’ అనేది వారినే తేల్చుకోమని చెప్పారు. చిత్రం ఏమంటే… హౌస్‌లో నాలుగు వారాలుగా బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్న ఇద్దరేసి కంటెస్టెంట్లను ఒకేసారి బిగ్ బాస్ పిలవడం మొదలెట్టాడు. దాంతో ఇంతకాలం ఫ్రెండ్స్ కోసం సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయింది.

Read Also: Chiranjeevi: మల్కాజిగిరి ఎంపీగా ఉపాసన.. చిరు ఏమన్నారంటే..?

భార్యాభర్తలైన రోహిత్, మెరీనా ను ఇంతవరకూ బిగ్ బాస్ సింగిల్ కంటెస్టెంట్ గా ట్రీట్ చేశాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ యూ టర్న్ తీసుకున్నాడు. ఇక నుండి వీరిద్దరినీ వేర్వేరు కంటెస్టెంట్స్ గా గుర్తిస్తామని ప్రకటించాడు. అంతేకాదు… సోమవారం నామినేషన్ ప్రక్రియలో మొదట ఈ జోడినే పిలిచి, ఎవరు నామినేట్ కావాలనుకుంటున్నారో, ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారో తేల్చుకోమని చెప్పాడు. ఇంతవరకూ రోహిత్ ను గైడ్ చేస్తూ వచ్చిన మెరీనా… ఇక్కడ కూడా అతన్నే సేఫ్ జోన్ లోకి నెట్టి, తాను నామినేషన్ ను స్వీకరించింది. ఆ తర్వాత ఇనయా, శ్రీహాన్ జోడీలో ఇనయా; వాసంతి, సుదీపలో వాసంతి; అర్జున్, శ్రీసత్యలో అర్జున్; ఆదిరెడ్డి, రేవంత్ లో ఆదిరెడ్డి; ఫైమా, సూర్యలో ఫైమా; బాలాదిత్య, రాజ్ లో బాలాదిత్య; చలాకీ చంటి, గీతూలో చంటీ రిస్క్ తీసుకుని నామినేషన్స్ ను స్వీకరించారు. అలా ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ కీర్తి భట్ ను పక్కన పెడితే, మెరీనా, ఇనయా, వాసంతి, అర్జున్, ఆదిరెడ్డి, ఫైమా, బాలాదిత్య, చలాకీ చంటీ నామినేట్ అయ్యారు. మరి ఈ మధ్యలో బిగ్ బాస్ వేరే ఏమీ మెలికలు, మలుపులు పెట్టకపోతే… వీరిలో ఎవరెవరికి ప్రేక్షకుల మద్దత్తు లభిస్తుందో చూడాలి.

Show comments