బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కౌండౌన్ మొదలైంది.. ఇక మూడు రోజులు మాత్రమే ఉంది.. దీంతో జనాలతో పాటుగా హౌస్ మెట్స్ కూడా జోష్ ను పెంచేందుకు ఆచి పేరుతో డిఫరెంట్ టాస్క్ లను బిగ్ బాస్ ఇచ్చారు.. కుటుంబ సభ్యులు పంపిన వంటకాలు దక్కించుకోవాలనుంటే వారి తరుపున ఇతర సభ్యులు గేమ్ ఆడి గ్రహాంతరవాసులని మెప్పించాలి. ముందుగా అర్జున్ సతీమణి తన భర్త కోసం మటన్ కర్రీ, రాగి సంగటి పంపింది. అర్జున్ తన భార్య పంపిన ఫుడ్ అందుకోవాలంటే యావర్ షేక్ బేబీ షేక్ గేమ్ గెలవాలి. గతంలో లాగా కాకుండా యావర్ అద్భుతంగా గేమ్ ని ఫినిష్ చేశాడు.. ఆ వంటను అందరికీ పంచాడు..
ఆ తర్వాత శివాజీకి తన ఫ్యామిలీ నుంచి ఫుడ్ వచ్చింది. శివాజీ కొడుకు వీడియో సందేశం ద్వారా.. నాన్న నీకు చికెన్ కర్రీ పంపిస్తున్నాం. హైదరాబాద్ లో డబ్బులు లేని సమయంలో ఆకలితో పార్క్ లో పడుకున్న రోజులని గుర్తు చేశాడు. ఆ మాటలకు శివాజీ ఎమోషనల్ అయ్యాడు.అలాంటి ఆకలి రోజుల నుంచి నిన్ను ఆర్టిస్ట్ గా చేసిన ప్రేక్షకులని తలచుకుంటూ నువ్వే విన్నర్ అవ్వాలి అంటూ ఏడ్పించేసాడు.. అక్కడ ప్రియాంకను బాల్ బ్యాలెన్స్ చెయ్యమని చెప్పారు.. అందులో ప్రియాంక సక్సెస్ అయ్యింది..
అలాగే అమర్ కోసం రొయ్యల బిరియాని వచ్చింది.. దానికోసం శివాజీకి ఒక టాస్క్ ను ఇచ్చాడు.. అది పూర్తికాగానే ఆ ఫుడ్ ను తీసుకొని టేస్ట్ చేసి అందరికీ ఇచ్చాడు.. ఫుడ్ ని ఎంజాయ్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చిన్న టాస్క్ ఇచ్చారు. హౌస్ లో ఇన్ని రోజుల పెర్ఫామెన్స్ ని బట్టి 60 నిమిషాల ఎపిసోడ్ లో కనిపించాల్సి వస్తే మీకు మీరు ఎన్ని నిమిషాలు ఎంచుకుంటారు.. ఇతరులకి ఎన్ని నిమిషాలు ఇస్తారు అని బిగ్ బాస్ ప్రశ్నించారు. దీనితో అర్జున్ 10 నిమిషాలు కనిపిస్తా అని మెడలో ఆ ట్యాగ్ వేసుకున్నారు.. అమర్, శివాజీలు కూడా ట్యాగ్ వేసుకున్నారు.. ఇక విన్నర్ రేసులో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే రైతుబిడ్డ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. ఇక బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ను ఇస్తారో చూడాలి ఈరోజు ఎపిసోడ్ ఎంత ఫన్ గా ఆకట్టుకుంటుందో చూడాలి..