బిగ్ బాస్ వారంతరం వచ్చిందంటే ఆ పండగే వేరు.. నాగ్ ఎపిసోడ్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తారు.. ఆదివారం మాత్రం ఫుల్ ఫన్ గా ఎపిసోడ్ సాగుతుంది. ఇక ఎలిమినేషన్ కూడా ఉంటుంది అందుకే వీకెండ్ ఎపిసోడ్ పై జనాల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటిని వీడారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడోవారం దామిని ఎలిమినేటై వెళ్లిపోయారు.. ఇప్పుడు అబ్బాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారని తెలుస్తుంది..
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సరికొత్తగా నిర్వహించాడు బిగ్ బాస్. శివాజీ, సందీప్, శోభా శెట్టిలను జ్యూరీ సభ్యులుగా నియమించాడు. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ చెప్పే కారణాలను వారు ఏకీభవించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక నామినేట్ అయ్యారు.. ఈ వారం తేజ బయటకు వెళ్లనున్నారని తెలుస్తుంది.. ఓటింగ్ లో ప్రిన్స్ యావర్ టాప్ లో ఉన్నాడట. తర్వాత స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడట. ప్రియాంక, శుభశ్రీ మధ్య గట్టి పోటీ నడిచిందట..
గత వారంలతో పోలిస్తే ఈ వారం రతికకు తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తుంది.. తేజా కూడా వెనుకపడ్డాడట. వీరిద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందట. ఈ క్రమంలో టేస్టీ తేజా లేదా రతికా రోజ్ ఈ వారం హౌస్ ని వీడతారని సమాచారం. వరుసగా ముగ్గురు లేడీస్ హౌస్ వీడిన తరుణంలో అబ్బాయిని ఇంటి నుంచి పంపనున్నారని సమాచారం.. అందులో రతిక గ్లామర్ తో హౌస్ లో అలరిస్తుంది.. యూత్ కూడా రతికను చూస్తున్నారు.. దాంతో ఇప్పుడు తేజ బయటకు వెళ్లి ఛాన్స్ ఉందని తెలుస్తుంది.. మరి ఎవరు వెళ్తారో చూడాలి..