శనివారం నాగార్జున బిగ్ బాస్ వేదికపై ఆసక్తికరమైన పని ఒకటి చేశాడు. ఓ గిటార్ ను తీసుకుని స్టేజ్ పై సుతారంగా వాయించాడు. గిటార్ ప్లే చేయడం నాగ్ కు బహుశా రాకపోయి ఉండొచ్చు… అందుకే ప్లే చేస్తున్నట్టు నటించాడు. నాగార్జున ఇక్కడ గిటార్ ప్లే చేస్తున్న సమయంలో అక్కడ హౌస్ లో దానిని చూస్తూ శ్రీరామ్ – హమీద తెగ సిగ్గుపడిపోయారు. విషయం ఏమిటంటే… దానికి రెండు రోజుల ముందు రాత్రి 2.45 నిమిషాల సమయంలో శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గిటార్ ను తీసుకుని, ఓ చక్కని ట్యూన్ ను ప్లే చేశాడు. హమీద దానిని ఎంచక్కా ఆస్వాదించింది. హమీద కోసమే శ్రీరామ్ అలా ప్లే చేశాడనేది వ్యూవర్స్ అందరికీ తెలిసింది. హౌస్ మేట్స్ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో వీరిద్దరూ ఇలా ఏకాంతంగా క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయడం నాగార్జున దృష్టిలోకి వచ్చింది.
Read Also : ప్రియాంక విషయంలో ప్రియ చెప్పిన రహస్యం!
వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం శనివారం నాగార్జున గిటార్ ప్లే చేశాడు. తర్వాత హమీదాను ‘ఎలా ఉంది?’ అని అడిగాడు. ‘చాలాబాగుంది. ఇలా ప్లే చేస్తుంటే ప్రేమగా అనిపిస్తుంది’ అని హమీదా బదులిచ్చింది. అలానే శ్రీరామ్ ను ఓ సెలబ్రిటీలా సన్నీ ఇంటర్వూ చేసిన సమయంలో అతను చెప్పిన సమాధానాలను నాగ్ శనివారం ప్రస్తావించాడు. సిరితో లంచ్, హమీదాతో డిన్నర్ అని శ్రీరామ్ చెప్పిన మాటలను రిపీట్ చేస్తూ, ఇంతకూ లంచ్ లో ఏం పెడతావు? అంటూ ఆట పట్టించాడు. ‘అయ్యో అవన్నీ సరదాగా చెప్పిన మాటలు’ అని ఇటు శ్రీరామ్, అటు సిరి సర్థుకునే ప్రయత్నం చేయడం, దానికి హమీద చిరునవ్వులు నవ్వడం విశేషం. మొత్తం మీద తమ మధ్య ఏం లేదని శ్రీరామ్ – హమీద చెబుతున్నా… ఏదో హైడ్ చేస్తున్నారనేది మాత్రం అర్థమౌతోంది.