ప్రియాంక విషయంలో ప్రియ చెప్పిన రహస్యం!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 27వ రోజుకు సంబంధించిన విశేషాలను శనివారం నాగార్జున మన టీవీ ద్వారా వీక్షకులకు చూపించారు. ఈ రోజు మొత్తం యాక్టివిటీస్ లో ఇద్దరు వ్యక్తుల మీద అందరూ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థం అవుతోంది. అందులో ఒకరు లోబో కాగా, మరొకరు ప్రియాంక. హౌస్ లోని వైట్ బోర్డ్ పై ఐదు యాప్స్ ను డిస్ ప్లే చేసి, వాటికి తగ్గ మనస్తత్త్వం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయమని హౌస్ మెంబర్ ను నాగార్జున కోరాడు. దాంతో ఎటెన్షన్ సీకర్ అనే పదాన్ని ఎక్కువ మంది ప్రియాంకకు అన్వయించారు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా నడుస్తుంది, చుట్టూ మగవాళ్ళు ఉన్నప్పుడు ఎలా వాక్ చేస్తుందనే దానిని రవి, ప్రియా అభినయించి చూపారు. అదే సమయంలో ప్రియాంక తనతో చెప్పిన ఓ రహస్యాన్ని కూడా ప్రియ బట్టబయలు చేసింది. మానస్ – శ్రీరామ్ ఎప్పుడైనా, ఏదైనా విషయంలో వాదనకు దిగితే, ప్రియాంక తట్టుకోలేదని, తన దగ్గరకు వచ్చి ‘వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళు, వారు గొడవ పడుతున్నార’ని చెబుతుందని ప్రియా తెలిపింది. ఇదే సమయంలో నోరును అదుపు పెట్టుకోమనే యాప్ ను, బ్రెయిన్ ను ఉపయోగించమనే యాప్ ను అత్యధిక శాతం మంది లోబోకు అన్వయించారు. అదే విధంగా లోబో సింపతీ గైనర్ అంటూ కాజల్ చెప్పింది. ఎవరైనా ఏదైనా తినేప్పుడు లోబో వచ్చి జాలిగా ముఖం పెడతాడని, దాంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా తాము తినే ఆహారాన్ని అతనికి ఇచ్చేస్తుంటారు. అప్పటికే ఆహారం తీసుకున్నా, లోబో పెట్టే ఆ సింపతీ ఎక్స్ ప్రెషన్ కు అందరూ పడిపోతారని కాజల్ తెలిపింది.

లోబోకు క్లాస్ పీకిన నాగ్
శనివారం నాగార్జున లోబో కు గట్టిగానే క్లాస్ పీకాడు. అందరూ అనుకుంటున్నట్టుగా ప్రియ మీద లోబో ఆవేశంగా అరిచిన అంశాన్ని ప్రస్తావించాడు. ‘అప్పుడు ఎలా అరిచావో చూపించు లోబో’ అని నాగార్జున కోరినా, గుర్తులేదంటూ లోబో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో అప్పటి వీడియోను నాగార్జున మరోసారి ప్రదర్శించి, లోబోకు చూపించి, ఇది అన్ ఫెయిర్ అని స్పష్టం చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో అరుపులు, కేకలకు స్థానం లేదని, అలానే బస్తీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించవద్దని, ఇక్కడ అంతా సమానమేనని చెప్పాడు. బిగ్ బాస్ చెప్పినా కూడా ఆహారాన్ని దాచుకోవడం, జెస్సీ వారించినా వినకుండా దానిని తినడం కరెక్ట్ కాదని తెలిపాడు. మొత్తం మీద ఈ రోజు లోబో మీదనే అందరి కళ్ళు పడ్డాయి. ఇక లోబో… జెస్సీకి చేసిన హెయిల్ స్టైల్ ను నాగ్ అభినందించాడు. జెస్సీ ని చూస్తుంటే రోనాల్డ్ గుర్తొస్తున్నాడని చెప్పాడు. జెస్సీతో ఉన్నంత కంఫర్ట్ గా తాను సిరితో ఉండలేకపోతున్నానని షణ్ణు ఆమెకే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సిరి మాత్రం షణ్ణు మాటలను పాజిటివ్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. నేను ఇంతే, నాలాంటి వ్యక్తి ఈ హౌస్ కు కరెక్ట్ కాదేమో అంటూ ఒకానొక సమయంలో కన్నీళ్ళు పెట్టుకుని బేలగా మాట్లాడింది సిరి. ఆమె కాజల్ కాస్తంత కూల్ చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ను స్పాన్సర్ చేస్తున్న ఏ సంస్థ ఇచ్చిన గ్రాసరీతో బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ అందరూ పొంగలి, దోసెలు చేసుకుని ఎంచక్కా కడుపునిండా లాగించేశారు.

గెలవాలంటే తగ్గాల్సిందే విజేతలకు స్వీట్ సర్ప్రైజ్
నామినేషన్స్ ఎంపిక కోసం బిగ్ బాస్ పెట్టిన ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. దాన్ని హౌస్ మెంబర్స్ అందరూ సిన్సియర్ గా ఆడారు. ఈ ఆట కారణంగా ఎవరెవరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో నాగార్జున శనివారం తెలిపాడు. అందులో పాల్గొన్న జట్లకు బిగ్ బాస్ స్వీట్ సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చాడు. శ్రీరామ్ -హమీదా కు పేస్టీలు; యాని, శ్వేతకు కేక్స్; సన్నీ, మాసస్ కు మేక్రూన్స్; ప్రియా – ప్రియాంకకు చాక్లెట్స్; రవి, విశ్వకు లాలీపప్స్; లోబో – నటరాజ్ మాస్టర్ కు జెమ్స్ గిఫ్ట్ గా అందించాడు. అయితే షణ్ముఖ్ – సిరికి మాత్రం పచ్చి మిర్చిని బిగ్ బాస్ పంపించాడు. షణ్ణులో ఎంతో ఫైర్ ఉందని, దానిని అతను బయటకు తీయాలనే మిర్చిని బిగ్ బాస్ పంపాడని, అదే విషయం సిరికి కూడా వర్తిస్తుందని నాగ్ చెప్పాడు. ఇదే సమయంలో సిరి తన ఆట తాను ఆడాలని, షణ్ముఖ్ తో స్నేహం కొనసాగిస్తూనే, అక్కడికి స్టికాన్ అయిపోకుండా కాస్తంత బయటకు రావాలని నాగ్ కోరాడు. ఇక ఆ టాస్క్ లో అన్ వాలీడ్ జట్టు అయిన జెస్సీ – కాజల్ కు బిగ్ బాస్ ఎలాంటి స్వీట్స్ ఆఫర్ చేయలేదు.

ఎలిమినేషన్ నుండి సేవ్ అయిన ఆ నలుగురు
బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారంలో ఏకంగా ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. అందులో శనివారం నాగార్జున ఏకంగా నలుగురిని సేవ్ చేశారు. మొదటి రౌండ్ లో సేఫ్ – అన్ సేఫ్ అంటూ ఆడిన స్టికర్ ఆటలో రవి సేవ్ అయ్యాడు. ఆ తర్వాత ఫోన్ రింగ్ అయినప్పుడు మిగిలిన ఏడుగురిలో ఆరుగురికి ఎంగేజ్ సౌండ్ రాగా, యూ ఆర్ సేఫ్ అంటూ ప్రియకు సమాధానం వచ్చింది. దాంతో ఆమె సేవ్ అయిపోయింది. ఇక ఓ వాటర్ టబ్ లో నాగార్జున మిగిలిన ఆరుగురి ఫోటోలను వేయగా, అందులో సన్నీ, కాజల్ ఫోటోలు నీటిలో తేలడంతో వారిద్దరూ సేవ్ అయిపోయారు. ఇక మిగిలింది… యాని, నటరాజ్, సిరి, లోబో. వీరి భవితవ్యం ఏమిటనేది ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది. అయితే… ఇప్పటికే నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టుగా విస్త్రృత ప్రచారం జరుగుతోంది.

-Advertisement-ప్రియాంక విషయంలో ప్రియ చెప్పిన రహస్యం!

Related Articles

Latest Articles