NTV Telugu Site icon

షణ్ణూ కు చికాకు తెప్పిస్తున్న సిరి!

Siri-and-Shanmukh

Siri-and-Shanmukh

షణ్ముఖ్ కెప్టెన్ కావడం కోసం సిరి తన వంతు సాయం ప్రతిసారీ చేస్తూనే వచ్చింది. అయితే ఒకసారి కెప్టెన్ అయిన తర్వాత షణ్ముఖ్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను కెప్టెన్ అయ్యాక ఎక్కువ తలనొప్పి సిరితోనే రావడం కాస్తంత ఇబ్బందికరమే. కాజల్ తో సిరి డైరెక్ట్ గా మాట్లాడకుండా పెదాలు కదుపుతూ తన ఫీలింగ్స్ ను తెలియచేయడాన్ని బిగ్ బాస్ తప్పు పట్టాడు. అలా గుసగుసలాడటం, సైగలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. దానికి సిరి, కాజల్ సారీ చెప్పారు. ఆ తర్వాత కూడా సిరి మైక్ ను సరిగా పెట్టుకోకపోవడంతో ఆమెను బిగ్ బాస్ మరోసారి హెచ్చరించాడు.

Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి

ఈ రెండు పనులతో సిరి పట్ల కోపం తెచ్చుకున్న షణ్ముఖ్ ఆమె వైపు సీరియస్ గా చూస్తేనే ఆమె హర్ట్ అయిపోయింది. అందరినీ వదిలి షణ్ణు తన వెనకే పడతాడని రాగాలూ తీసింది. అయితే ఓ స్నేహితురాలు అయి ఉండి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావంటూ షణ్ణు ఆమెతో అన్నాడు. నీ కారణంగా నేను పలచన అవుతున్నాననీ గట్టిగానే చెప్పాడు. దానికి ముందు కూడా షణ్ణు మాటలకు సిరి అలగడంతో బతిమిలాడి, సారీ చెప్పి భోజనానికి పిలిచాడు. అలా షణ్ణును తెలిసో తెలియకో సిరి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే… గురువారం విడుదలై ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అయిపోతోంది. సిరి, షణ్ణు కూ బాగా దగ్గర కావడం, అవకాశం కల్పించుకుని మరీ హగ్గులు ఇవ్వడం వాళ్ళిద్దరికీ బాగానే ఉండొచ్చు కానీ చూస్తున్న వీక్షకులకు ఒక్కోసారి చికాకును తెప్పిస్తోంది. ఇక సిరి తల్లి అయితే ఆ విషయాన్ని డైరెక్ట్ గా ఇంటి సభ్యులందరి ముందు తన కూతురుకే చెప్పేసింది. షణ్ముఖ్ ఎంత సపోర్ట్ చేస్తున్నా, ఫ్రెండే అయినా అతన్ని హగ్ చేసుకోవడం తనకు నచ్చలేదని, తెలియకుండానే సిరి అతనికి దగ్గర అవుతోందని కుండబద్దలు కొట్టి మరి తెలిపింది. మరి దీనిపై సిరి, షణ్ణు ఆమెకు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. సో… తమ అతి చనువు బూమరాంగ్ అయిన విషయాన్ని వాళ్ళిద్దరూ ఇప్పటికైనా అంగీకరిస్తారో లేదో!!