“ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి

టాప్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. “ఆర్‌ఆర్‌ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్, అప్డేట్స్ రూమర్స్ సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక ఈ పాన్ ఇండియా సినిమాను విడుదల చేయడానికి రాజమౌళి వేస్తున్న ప్లాన్స్ అదిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. “ఆర్ఆర్ఆర్” కోసం వచ్చే నెల నుంచి వరుస ఈవెంట్స్ ను ప్లాన్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తాజాగా రాజమౌళి ఇచ్చిన హింట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

Read Also : లైవ్ : “ఆర్ఆర్ఆర్” సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్

తాజాగా ఈ సినిమాలోని ‘జనని’ అనే సాంగ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ మంత్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, మల్టిపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా మీడియాతో ప్రెస్ మీట్ ఉంది. ఆ సమావేశంలో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంటుంది. అందులో విలేఖరులు అడగాలనుకున్న విషయాలను అడగొచ్చని అన్నారు. ఈ సాఫ్ట్ మెలోడీని ప్రస్తుతానికి విలేఖరులకు మాత్రమే విన్పించారు. రేపు ప్రేక్షకుల కోసం విడుదల చేయనున్నారు.

Related Articles

Latest Articles