NTV Telugu Site icon

నియంత మాటే శాసనం!

Bigg-Boss-5

Bigg-Boss-5

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రధారి రమ్యకృష్ణ డైలాగ్ గుర్తుంది కదా! ‘నా మాటే శాసనం’ అంటూ ఉంటుంది. ఇప్పుడు అదే మాటను కాస్తంత మార్చి ‘నియంత మాటే శాసనం’ అంటున్నాడు బిగ్ బాస్. సీజన్ 5 ముగియడానికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉండటంతో, చివరి కెప్టెన్సీ టాస్క్ ను మొదలు పెట్టేశారు. దాని పేరే ‘నియంత మాటే శాసనం’. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో ఓ భారీ సింహాసనం పెట్టారు. బజర్ మోగగానే హౌస్ మెంబర్స్ లో ఎవరు ముందు అందులో కూర్చుంటే వారే నియంత. ఆ తర్వాత బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తాడు. అందులో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఆ నియంతకు ఉంటుంది. తమను ఎందుకు ఎలిమినేట్ చేయకూడదో చెప్పే అవకాశం వారికి బిగ్ బాస్ ఇస్తాడు.

ఈ గేమ్ కు మానస్ సంచాలకుడిగా వ్యవహరిస్తాడు. ఈ టాస్క్ లో సిరి మొదట నియంత సింహాసనంలో చోటు సంపాదించుకుంది. ఆ సమయంలో జరిగిన టాస్క్ లో సన్నీ, రవి చివరి స్థానంలో నిలువగా సన్నీని సిరి ఔట్ చేసింది. ఆ తర్వాత శ్రీరామ్ నియంత ప్లేస్ ను దక్కించుకున్నప్పుడు రవి, కాజల్ లాస్ట్ ప్లేస్ లో ఉండగా, కాజల్ ను ఔట్ చేశాడు. ఆ పైన రవి నియంత సింహాసనంపై చోటు దక్కించుకున్నాడు. అప్పుడు జరిగిన టాస్క్ లో షణ్ముఖ్, మానస్ చివరిలో ఉండగా, మానస్ ను ఔట్ చేశాడు. ఇక మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో చివరగా ప్రియాంక నియంత సింహాసనం దక్కించుకుంది. ఆమె షణ్ముఖ్, శ్రీరామ్ లో శ్రీరామ్ ను సేవ్ చేసింది. దాంతో చివరి కెప్టెన్సీ టాస్క్ పోటీ నుండి ఇంతవరకూ సన్నీ, కాజల్, మానస్, శ్రీరామ్ వైదొలగినట్టు అయ్యింది. అయితే ఇదే ఫైనల్ అనడానికి లేదు. మర్నాడు కూడా కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించిన ఆట కొనసాగబోతోంది. అదే సమయంలో బిగ్ బాస్ మనసు మార్చుకుని వీరిలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేసే ఛాన్స్ కూడా ఇవ్వొచ్చు.

Read Also : ఎన్టీఆర్ ట్రస్ట్ వర్సెస్ హనుమ విహారి ఫౌండేషన్… సారీ చెప్పాలంటూ డిమాండ్

ఇదిలా ఉంటే… మంగళవారం ఎపిసోడ్ ప్రారంభంలో కిచెన్ ఛాంపియన్ ఆఫ్ ద వీక్ అవార్డును కెప్టెన్ మానస్, శ్రీరామ్ కు అందించాడు. దాంతో అతనికి 25 వేల రూపాయల గిఫ్ట్ హ్యాంపర్ లభించింది. శని, ఆదివారాల్లో నాగార్జున హౌస్ లో మానసికంగా దగ్గరైన వారికి పర్శనల్ గా క్లాస్ తీసుకోవడంతో సోమ, మంగళవారాలు ఎవరికి వారు సొంతంగా ఆట ఆడటం మొదలు పెట్టారు. అయితే నియంతగా స్థానం సంపాదించి తన టీమ్ ను కాపాడాలని ప్రియాంక తాపత్రయ పడింది. ఈ క్రమంలో ఒకసారి ఆ స్థానంలో సిరి కూడా కూర్చోడానికి ప్రయత్నించడం, మానస్ ప్రియాంక వైపు మొగ్గు చూపడంతో సిరి హర్ట్ అయ్యింది.

మానస్ పింకీ కి ఫేవర్ గా నిర్ణయం తీసుకున్నాడని, తానే ముందు కూర్చున్నానంటూ ఏడుపు స్టార్ట్ చేసింది. దీనిని షణ్ణు తీవ్రంగా ఖండించాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఏడవడం కంటే గేమ్ లో సత్తా చాటడం మంచిదని హితవు పలికాడు. మరి బుధవారం ఆ మాటలు పాజిటివ్ గా తీసుకుని సిరి మళ్ళీ రెచ్చిపోతుందేమో చూడాలి.