ఎన్టీఆర్ ట్రస్ట్ వర్సెస్ హనుమ విహారి ఫౌండేషన్… సారీ చెప్పాలంటూ డిమాండ్

ఎన్టీఆర్ ట్రస్ట్ వర్సెస్ హనుమ విహారి ఫౌండేషన్ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ టెస్ట్ టీమ్ క్రికెటర్ హనుమ విహారి ఫౌండేషన్ ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేయడం, ఇక నుంచి తన ఫౌండేషన్ నుంచి ఎలాంటి సహాయసహకారాలు అందించలేనని, క్షమించండి అంటూ హనుమ విహారి ఫౌండేషన్ ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడం సంచలనంగా మారింది.

అసలు ఏం జరిగింది ?
మూడు రోజుల క్రితం తిరుపతిలో భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న ప్రజలు తిండి, సహాయం కోసం అల్లాడిపోయారు. అదే సమయంలో హనుమ విహారి ఫౌండేషన్ ప్రజలకు ఫుడ్ ప్యాకెట్స్ అందించడం వంటి సహాయ కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్ట్, జై టీడీపీ దుస్తులు ధరించి పాల్గొన్నారు. ఆ ఫోటోలను టీడీపీకి చెందిన వ్యక్తులు సోషల్ మీడియాలో షేర్ చేసి, వైరల్ చేసింది.

Read Also : మిస్టర్ బీన్ ఇక లేరు… ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఘనకార్యం

అదే రోజు ఏపీలో…
నవంబర్ 19న ఏపీ అసెంబ్లీలో ఓ ఘటన జరిగింది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వైసీపీ నేతలు తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడారు అంటూ మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నాయకుల వరకూ వైసీపీ నాయకుల చర్యలను ఖండించారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ ఇంకోసారి వైసీపీ నాయకులు ఇలా హద్దుమీరితే సహించేది లేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయితే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టను అని శపథం చేశారు.

దానికీ, దీనికి లింకేంటి?
దానికీ, దీనికి లింకేంటి? అంటే రెండు సంఘటనలూ ఒకేసారి చోటు చేసుకున్నాయి. తిరుపతిలో హనుమ విహారి ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు చేపట్టినప్పుడే, ఏపీలో ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. దీంతో వైసీపీ నాయకులు చేసిన కామెంట్స్ ను తప్పు పడుతూ, టీడీపీని సమర్థించే క్రమంలో టీడీపీకి చెందిన వ్యక్తులు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఏపీలో ఇంత జరుగుతున్నా తాము తిరుపతిలో సహాయ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపే ప్రయత్నం చేశారు.

Read Also : శవ పేటికలో ఎలిమినేషన్ ఏంటి ? ‘బిగ్ బాస్’పై నెటిజన్లు ఫైర్

హనుమ విహారి ఫౌండేషన్ రియాక్షన్
2021 నవంబర్ 19న జరిగిన తిరుపతిలో జరిగిన సహాయ కార్యక్రమాలకు ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్ట్, జై టీడీపీ ఎలాంటి సంబంధం లేదు. మాతో పాటు వచ్చిన ఇద్దరు రవి, లోకేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్ట్, జై టీడీపీ టీషర్ట్స్ వేసుకుని ఉన్నారు. అంతమాత్రాన ఇది మీరు చేసినట్టు కాదు కదా ? అంటూ హనుమ విహారి ఫౌండేషన్ ట్వీట్ చేసింది. అక్కడ మొదలైంది వివాదం.

ఇదీ వివాదం !
విహారి ఫౌండేషన్ చేసిన ట్వీట్ టీడీపీ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. పైగా వైసీపీని అభిమానించే వాళ్ళు కూడా టీడీపీని దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్, జై టీడీపీ టీషర్ట్స్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు తాము విహారి ఫౌండేషన్ సహాయం చేయలేదని, ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం అందించామని, అదే సమయంలో విహారి ఫౌండేషన్ వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారని, వాళ్లకు అప్పుడు మ్యాన్ పవర్ అవసరం ఉండడంతో వీళ్ళు చేతులు కలిపి పని చేసినట్టు తెలిపారు. అంతే టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో విహారి ఫౌండేషన్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎక్కడ? విహారి ఫౌండేషన్ ఎక్కడ? విహారి ఫౌండేషన్ 3 వేల సహాయం అందిస్తే, ఎన్టీఆర్ ట్రస్ట్ 3 లక్షల సహాయం అందించింది. నీది ఏ కులం అంటూ వ్యక్తిగత దూషణకు దిగారు.

Read Also : పద్మ అవార్డు దుష్ప్రభావమా?… కంగనాపై సీనియర్ నటుడి కామెంట్స్

హనుమ విహారి ఫౌండేషన్ ట్విట్టర్ డిలీట్
దీంతో హనుమ విహారి స్పందించి “మమ్మల్ని క్షమించండి. మాకు సమాచార లోపం జరిగింది. మాకు ఎన్టీఆర్ ట్రస్ట్, జై టీడీపీ ట్రస్ట్ అన్నా ఎనలేని గౌరం ఉంది” అన్నట్టుగా ట్వీట్ చేశారు. అయినప్పటికీ ఎన్టీఆర్ ట్రస్ట్ అభిమానులు చల్లబడకపోగా ఆయన సేవా కార్యక్రమాలకు కులం, రాజకీయ రంగు అద్దుతూ మరింత రెచ్చిపోగా, హనుమ విహారి హర్ట్ అయ్యారు. “హనుమ విహారి ఫౌండేషన్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలను అందించలేము. క్షమించండి” అంటూ హనుమ విహారి ఫౌండేషన్ ట్విట్టర్, హనుమ విహారి ట్విట్టర్ ఖాతా రెండింటినీ డిలీట్ చేశారు.

ట్రెండింగ్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ సారీ చెప్పాలి…
హనుమ విహారి ఫౌండేషన్ నుంచి సహాయం అందుకున్న ప్రజలు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రస్ట్ పై మండిపడుతూ హనుమ విహారికి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో #ntr trust should apologize hanuma vihari foundation అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles