సెప్టెంబర్ 5న “బిగ్ బాస్-5” అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే అందులో సగం మంది కంటెస్టెంట్లు ఎవరో కూడా ప్రేక్షకులకు తెలియకపోవడం “బిగ్ బాస్”పై విమర్శలకు కారణమైంది. ఎలాగైతేనేం నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన షో రాత్రి 10 వరకు గ్రాండ్ గా సాగింది. టీవీ యాంకర్ రవి, గాయని శ్వేత, ఆర్జే కాజల్, నటుడు మానస్, ఉమాదేవి, విశ్వ, నటి సరయు, కొరియోగ్రాఫర్ నటరాజ్, హమీదా, యూట్యూబర్ షణ్ముఖ్, ప్రియాంక, సూపర్ మోడల్ జైసీ, టీవీ నటి ప్రియ, లోబో, కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్, ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్స్ సింగర్ శ్రీరామచంద్ర, లాహిరి అర్బన్, టీవీ నటుడు సన్నీ, యూట్యూబర్ సిరి “బిగ్ బాస్-5” హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనడం విశేషం.
Read Also : ఏపీ సీఎంని కలిసిన మంచు హీరో… అసలేం జరుగుతోంది ?
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నాగార్జున ఈ షోకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ? సోషల్ మీడియా కథనాల ప్రకారం “బిగ్ బాస్” ఈ కొత్త సీజన్ కు నాగార్జున భారీ మొత్తాన్నే తీసుకుంటున్నాడు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న మూడో సీజన్ ఇది. మూడవ సీజన్‌లో నాగార్జన ఒక ఎపిసోడ్ కోసం రూ.12 లక్షలు వసూలు చేశాడు. నాల్గవ సీజన్‌లో ఆయన పారితోషికం కొద్దిగా పెరిగింది. ఇప్పుడు ఐదవ సీజన్ కోసం నాగార్జన తన రెమ్యూనరేషన్ ను 15 శాతం పెంచారు. ఈ సీజన్ మొత్తానికి కలిసి నాగ్ దాదాపు 11 నుండి 12 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై నాగ్ కానీ, మేకర్స్ కానీ స్పందించలేదు. వారి నుంచి ఇప్పటి వరకూ ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.