NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : సిరికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss 5 : Trolling on Contestent Siri

“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈసారి కంటెస్టెంట్స్ అంతా ఎవరి స్ట్రాటజీతో వాళ్ళు ఆడుతున్నారు. గొడవలతో, ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ వీకెండ్ తో 6 వారాల షో పూర్తవ్వనుంది. ఈ వీక్ 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కాగా ఈ వీక్ మొత్తం బొమ్మల కొలువులోనే గడిచిపోయింది. రెండు టీంలుగా ఏర్పడిన ఇంటి సభ్యులు టెడ్డీలను కుట్టాలి. సిరి, కాజల్ ఇద్దరూ సంచాలకులుగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో సంచాలకులకు, ఇంటి సభ్యులకు మధ్య గొడవలు, కెప్టెన్సీ టాస్కులకు ఎంపిక కావడం గురించి హౌజ్ జరుగుతున్న చర్చలు చూస్తున్నాము. ఇక ఈరోజు బొమ్మల టాస్క్ పూర్తి కానుంది.

Read Also : టీజర్ : అదరగొట్టిన ‘అన్నాత్తే’… పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫీస్ట్

ఈరోజు విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే సిరికి బిగ్ బాస్ షాక్ ఇచ్చినట్లుగా కన్పిస్తోంది. హౌస్ మేట్, సంచాలక్ కాజల్ మధ్య వాదనలతో బిగ్ బాస్ ప్రోమో ప్రారంభమైంది. కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నప్పుడు హౌస్‌లో కంటెస్టెంట్‌లు పెద్ద నియమాన్ని పాటించడంలో విఫలమయ్యారని, అందువల్ల బిగ్ బాస్ ఇద్దరు పోటీదారులను కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించామని ప్రకటించారు. కెప్టెన్సీ టాస్క్ సమయంలో ప్రధాన నియమాల ఉల్లంఘనలు జరిగాయని, ఫలితంగా అనర్హత వేటు పడుతుందని ప్రోమో సూచిస్తోంది. అనర్హత ప్రకటన తర్వాత సన్నీ, యాని, మానస్ సంబరాలు చేసుకోవడం, సిరి, శ్వేత నీరస పడిపోవడం ప్రోమోలో కన్పిస్తోంది. వారిద్దరూ కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ చేయడానికి అర్హులు కాదని బిగ్ బాస్ చెప్పే అవకాశం ఉంది.