టీజర్ : అదరగొట్టిన ‘అన్నాత్తే’… పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫీస్ట్

సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శివ కాంబోలో ‘అన్నాత్తే’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, ఖుష్బు, మీనా, జగపతి బాబు, సూరి, సతీష్, బాల (దర్శకుడు శివ సోదరుడు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించిన రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ 4 నవంబర్ 2021 న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గతంలో రజనీకాంత్ సూపర్ హిట్‌లు ఎందిరన్, పెట్టా ఈ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కాయి. డి ఇమ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.

Read Also : పవన్ కల్యాణ్, మంచు మనోజ్ భేటీ

అందరూ ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ గత నెల వినాయక చతుర్థి సందర్భంగా లాంచ్ అయ్యింది. రెండు పోస్టర్లకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఇక చెప్పినట్లుగానే ఈరోజు మేకర్స్ సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘అన్నాత్తే’ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. రజినీ లుక్, యాక్షన్ సన్నివేశాలు… ఇది పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫీస్ట్ అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు ‘అన్నాత్తే’ తమిళ, తెలుగు పంపిణీ హక్కులను తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘అన్నాత్తే’ భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ‘అన్నాత్తే’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ టీజర్ చూస్తుంటే వారి నమ్మకం నిజమయ్యేలాగే కన్పిస్తోంది.

-Advertisement-టీజర్ : అదరగొట్టిన 'అన్నాత్తే'… పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫీస్ట్

Related Articles

Latest Articles