బిగ్ బాస్ 5 : వాళ్ళను గుర్తు చేస్తున్నావ్… సిరిపై ట్రోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ సీజన్ 5” కంటెస్టెంట్ సిరిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టాస్క్ సమయంలో సన్నీ తనను అసభ్యకరంగా తాకాడంటూ సిరి ఆరోపించడంతో దానికి కారణమైంది. బిగ్ బాస్ సీజన్ 2లో భాను, తేజస్విలతో ఆమెను పోలుస్తున్నారు. సీజన్ 2 సమయంలో భాను శ్రీ, తేజస్వి మరో కంటెస్టెంట్ కౌశల్‌తో ఇలాగే ప్రవర్తించారు. ఫిజికల్ టాస్క్ సమయంలో లేడీ కంటెస్టెంట్లను అతను అసభ్యకరంగా తాకాడంటూ ఆరోపించారు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. వారు ఆరోపించినట్లుగా కౌశల్ తాకలేదని తరువాత ప్రూవ్ అవ్వడంతో నెటిజన్లు లేడీ కంటెస్టెంట్లపై విరుచుకు పడ్డారు. కావాలనే కౌశల్ ను టార్గెట్ చేశారంటూ వాళ్ళను ఎలిమినేట్ చేసేదాకా శాంతించలేదు.
Read Also : బిగ్ బాస్ హౌస్ లో ‘ఆ గట్టునుంటావా… ఈ గట్టునుంటావా’!
Also Read
అయితే అప్పట్లో భాను విషయంలో కౌశల్ నిజంగానే అలా చేశాడా ? సందేహం వచ్చింది ప్రేక్షకులకు. అందుకే ముందుగా ప్రేక్షకులు కొంతమంది కౌశల్ కు సపోర్ట్ చేస్తే, మరికొంత మంది మాత్రం భానుకు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు సిరి విషయంలో సన్నీ తప్పు చేయలేదని చాలా స్పష్టంగా ఉంది. అతను సిరి నుండి లాఠీలను దొంగిలించడానికి శ్వేత సహాయం తీసుకున్నాడు. ఇంతకుముందు వరకు లోబో సిరిని సీతాకోకచిలుక పిలవడంతో సిరిపై ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడు అదే నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె చీప్ ట్రిక్స్ తో సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. మొత్తం మీద ఆమె సన్నీ మీద చేసిన ఆరోపణలు బెడిసి కొట్టాయి. అతనికి సానుభూతి పెరుగుతుండగా, సిరిపై మాత్రం నెగెటివిటీ ఎక్కువయ్యింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!